ప్రియాంక రెడ్డి కేసు : సినిమాలు, సీరియల్స్ ప్రభావం ఉంది – కౌశల్

  • Published By: madhu ,Published On : December 1, 2019 / 09:52 AM IST
ప్రియాంక రెడ్డి కేసు : సినిమాలు, సీరియల్స్ ప్రభావం ఉంది – కౌశల్

సినిమాలు, సీరియల్స్ యువతపై ఎక్కువగా ప్రభావం చూపుతోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు బిగ్ బాస్ ఫేమ్ కౌశల్. ఎలా రేప్‌లు చేయాలి..అమ్మాయిలను హింసించాలి అనేది సినిమాల్లో చూపిస్తున్నామన్నారు. హింసాత్మకం ఎక్కువవుతుందని, దీనిని సెన్సార్ బోర్డు అరికట్టాలని సూచించారు. ప్రాబ్లమ్స్ వచ్చిన సమయంలో అమ్మాయిలు ఎలా వ్యవహరించాలనే దానిని చూపెట్టాలని కౌశల్.

డిసెంబర్ 01వ తేదీ ఆదివారం ప్రియాంక రెడ్డి ఇంటికి చేరుకున్నారాయన. పరామర్శించేందుకు వెళ్లిన ఆయన్ను..విల్లాలోని రానివ్వకుండా అపార్ట్‌మెంట్ వాసులు అడ్డుకున్నారు. నో సింపథీ, నో పోలీస్ అంటూ ఆందోళన చేస్తున్నారు. దీంతో కౌశల్‌ అక్కడ్నుంచి వెనుదిరిగారు. ప్రియాంక హత్య దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

హైదరాబాద్‌లో ప్రియాంకారెడ్డి హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలిపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. ఆమెను హత్య చేసి పెట్రోల్‌తో నిప్పులు పెట్టిన వైనం ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నలుగురు నిందితులను ఉరి తీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిందితులు ఆమెను ఎంతగా హింసించారో.. వారిని కూడా అదే విధంగా హింసించాలని అంటున్నారు.

> చైనాలో లైంగికదాడికి పాల్పడితే మగతనం ఖతం 
> అఫ్ఘనిస్తాన్‌లో రేప్‌ చేస్తే ఉరి శిక్ష అమలు
> ఫ్రాన్స్‌లో రేపిస్టులకు 15 నుంచి 30 ఏళ్లు జైలు శిక్ష 
> ఉత్తర కొరియాలో తుపాకీతో కాల్చి చంపే శిక్ష అమలు
> అమెరికాలో రేప్‌కు పాల్పడితే 30 ఏళ్ల వరకు జైలు శిక్ష
> ఇరాన్‌లో అత్యాచారానికి పాల్పడితే ఉరి శిక్ష 
> సౌదీ అరేబియాలో రేప్‌కు పాల్పడితే తల నరికి శిక్ష అమలు
> రష్యాలో అత్యాచార నిందితులకు సాధారణ శిక్షలు
> ఇండియాలో రేపిస్టులకు 14 ఏళ్ల జైలు శిక్ష 
> నేర తీవ్రత ఎక్కువగా ఉంటే మరణ దండన
Read More : కేసీఆర్ లంచ్ మీటింగ్ : ఆర్టీసీ జేఏసీ నేతలకు అందని ఆహ్వానం