Movies : ఈ వారం థియేటర్లో/ఓటిటిలో వచ్చే సినిమాలు ఇవే..

గత వారంతో పెద్ద పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అయిపోయాయి. మిగిలిన పెద్ద సినిమాలు అన్ని డిసెంబర్ కి క్యూ కట్టడంతో ఈ వారం అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. రావణాలంక, ఊరికి ఉత్తరాన, రామ్ అసుర్,

Movies : ఈ వారం థియేటర్లో/ఓటిటిలో వచ్చే సినిమాలు ఇవే..

Movies (1)

Movies :  కరోనా నుంచి బ్రేక్ రావడంతో సినిమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. గత వారంతో పెద్ద పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అయిపోయాయి. మిగిలిన పెద్ద సినిమాలు అన్ని డిసెంబర్ కి క్యూ కట్టడంతో ఈ వారం అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. రావణాలంక, ఊరికి ఉత్తరాన, రామ్ అసుర్, స్ట్రీట్ లైట్, పోస్టర్, సావిత్రి w/o సత్యమూర్తి, మిస్టర్ లోన్లీ.. ఇలా అన్ని చిన్న చిన్న సినిమాలే ఉన్నాయి. వీటిలో అంత ఇంట్రెస్టింగ్ అనిపించే సినిమాలు లేవు. ఒక్క ‘రామ్ అసుర్’ సినిమాని గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్ మారుతి వచ్చారు. బిగ్ బాస్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి మాత్రం నవంబరు 19న సైఫ్ అలీఖాన్ నటించిన ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది.

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు బెదిరింపు

ఇక థియేటర్ లో అంత ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏమి లేకపోవడంతో ఓటిటి వైపు చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సారి ఓటిటిలో కొంచెం పర్వాలేదనిపిస్తుంది. జీ5లో ఈ నెల 19న ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సిరీస్‌ విడుదల కానుంది. నిహారిక కొణిదెల స్వయంగా ఈ సిరీస్ ని నిర్మించింది. సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ ఇందులో హీరోగా చేస్తున్నాడు. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని మొదటి సారి హీరోయిన్ గా, తేజ సజ్జా హీరోగా రాబోతున్న సినిమా ‘అద్భుతం’. ఈ సినిమా కూడా నవంబర్‌ 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమాకి డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కథ అందించగా, మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఓ అమ్మాయికి, ఓ అబ్బాయికి ఒకే ఫోన్‌ నంబరు ఉంటే ఏమవుతుందనే విభిన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుంది. అఖిల్‌, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో దసరా కానుకగా థియేటర్స్ లో విడుదల అయి మంచి విజయం సాధించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమా నవంబరు 19న ఆహా, నెట్‌ఫ్లిక్స్‌ ఓటిటిలలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

Bigg Boss Jessy : బిగ్ బాస్‌లో 10 వారాలకు జెస్సి పారితోషకం ఎంతో తెలుసా??

వీటితో పాటు అమెజాన్‌ ప్రైమ్‌ లో హాలీవుడ్‌ సినిమా నెవర్‌ బ్యాక్‌ డౌన్‌ నవంబరు 16న విడుదల అవ్వబోతుంది. ద వీల్‌ ఆఫ్ టైమ్‌ వెబ్‌ సిరీస్‌ నవంబరు 19న రిలీజ్ అవ్వనుంది. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ లో నవంబరు 19న బాలీవుడ్ ‘క్యాష్‌’ సినిమా, మలయాళం ‘చురులీ’ సినిమా, తమిళ్ ‘పొన్‌ మాణిక్‌వేల్‌’ సినిమా రిలీజ్ అవ్వనున్నాయి. సోనీ లివ్‌ లో బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘యువర్‌ హానర్‌’ నవంబరు 19న రిలీజ్ అవ్వనుంది. ఎంఎక్స్‌ ప్లేయర్‌ లో ‘మత్స్యకాండ’ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్ నవంబరు 19న విడుదల కాబోతుంది.

Samantha : ‘పుష్ప’ ఐటెం సాంగ్ కోసం సమంత భారీ రెమ్యూనరేషన్..

ఇక నెట్‌ఫ్లిక్స్‌ లో నవంబర్ 17న ‘టైగర్‌ కింగ్‌’ సిరీస్ సీజన్ 2 రాబోతుంది. నవంబరు 19న ‘హెల్‌ బౌండ్‌’ సిరీస్‌, ‘కౌబాయ్‌ బే బోప్‌’ సిరీస్‌, బాలీవుడ్‌ యువ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ నటించిన ‘ధమాకా’ రిలీజ్ అవ్వబోతున్నాయి.