S.Thaman: థమన్ మ్యూజిక్ చేసే సినిమాలు.. ఈ పండగకి అప్డేట్స్ లేనట్లేనా?

ఉరిమి ఉరిమి మంగలం మీద పడ్డట్టు.. ధమన్ కోవిడ్ ఎఫెక్ట్ మహేష్ బాబు మీద పడుతోందంటున్నారు సూపర్ స్టార్ ఫాన్స్. ఒక పక్క కోవిడ్ తో థమన్ సఫర్ అవుతుంటే.. పండక్కి మా హీరో అప్ డేట్ వస్తుందా..

S.Thaman: థమన్ మ్యూజిక్ చేసే సినిమాలు.. ఈ పండగకి అప్డేట్స్ లేనట్లేనా?

S.thaman

S.Thaman: ఉరిమి ఉరిమి మంగలం మీద పడ్డట్టు.. ధమన్ కోవిడ్ ఎఫెక్ట్ మహేష్ బాబు మీద పడుతోందంటున్నారు సూపర్ స్టార్ ఫాన్స్. ఒక పక్క కోవిడ్ తో థమన్ సఫర్ అవుతుంటే.. పండక్కి మా హీరో అప్ డేట్ వస్తుందా రాదా అని తెగ వర్రీ అవుతున్నారు అభిమానులు. ఇలా సంక్రాంతికి అప్ డేట్ ఇద్దామనుకున్న థమన్ సినిమాలన్నీ కన్ ఫ్యూజన్ లో పడిపోయాయి. సౌత్ లోనే ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్. బ్యాక్ టూ బ్యాక్ నాన్ స్టాప్ గా చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా సినిమాలు చేస్తున్న థమన్ ఈ ఫ్లోకి ఇప్పుడు బ్రేక్ వెయ్యాల్సొచ్చింది.

Summer Movies Release: ఏప్రిల్ వార్.. ఈసారి ఎవరు అడ్డొచ్చినా తగ్గేదే లే!

ఎంతో జాగ్రత్తగా ఉండే థమన్ కి కోవిడ్ ఎటాక్ అయ్యింది. దాంతో మిగిలిన సినిమాల సంగతెలా ఉన్నా.. మహేష్ బాబు సర్కారు వారి పాట మీద మాత్రం కన్ ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. సంక్రాంతి నుంచి సర్కారు వారి పాట అప్ డేట్స్ షురూ అంటూ ట్వీట్ చేసిన థమన్ సిక్ అవ్వడంతో ఈ అప్ డేట్ మీద డౌట్ వచ్చేసింది జనానికి. ఇంకేం అప్ డేట్ వస్తుందంటూ అప్పుడే డిసప్పాయింట్ అయిపోయారు. థమన్ ఈ సినిమానే కాదు.. రాధేశ్యామ్ కి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడినా అగ్రిమెంట్ ప్రకారం ఆన్ టైమ్ లోనే సినిమా కంప్లీట్ చెయ్యాల్సి ఉంది తమన్.

Netflix-Prime Video: మాటకు మాట.. నెట్‌ఫ్లిక్స్-ప్రైమ్ వీడియో ట్విట్టర్ వార్!

ఈ క్రేజీ మూవీసే కాకుండా తమన్ చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్లో గాడ్ ఫాదర్, పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, రామ్ చరణ్-శంకర్ తో స్టార్ మూవీస్ చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు వరుణ్ తేజ్ గని, అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఏజెంట్, గుణశేఖర్ తో శాకుంతలం సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు. ఈ పెద్ద సినిమాలతో పాటు సూపర్ మచ్చి, డి.జె టిల్లు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. మిగలిన సినిమాల సంగతెలా ఉన్నా.. సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఈ సినిమాల మ్యూజిక్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ చేశాడు కాబట్టి.. పండగ రిలీజ్ లు సేప్ అయినట్టే. అయితే అప్ డేట్స్ సంగతి మాత్రం డౌటే అంటున్నారు థమన్ యూనిట్.