Flop Movies: భారీ నష్టాలను తెచ్చిన సినిమాలు.. ఫ్యాన్స్‌కు పీడ కల లాంటి డిజాస్టర్స్!
ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయితే భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన స్టార్ హీరోల సినిమాలు ఓ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తాయి. అదే అంచానాలు తప్పిందా.. అసలుకే ఎసరొచ్చి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొన్నిసార్లు నిర్మాతల వరకు కోలుకోలేని దెబ్బకొడతాయి.

Flop Movies: ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయితే భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన స్టార్ హీరోల సినిమాలు ఓ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తాయి. అదే అంచానాలు తప్పిందా.. అసలుకే ఎసరొచ్చి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొన్నిసార్లు నిర్మాతల వరకు కోలుకోలేని దెబ్బకొడతాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి దడ పుట్టించిన సినిమాలకు కొదవే లేదు. ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు పోసి బడా హీరోలను నిద్రపోనివ్వకుండా చేసిన టాప్ సూపర్ ప్లాప్స్ పై ఓ లుక్.
Action Movies: యాక్షన్ ఫార్ములా.. వయొలెన్స్ కావాలంటోన్న టాప్ స్టార్స్!
కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల రేంజ్, బిజినెస్ పెరిగింది. పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే మార్కెట్ లో జోరు కనిపిస్తుంది. భారీ ప్రాజెక్టులు విడుదలకు ముందే కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం చూస్తూనే ఉన్నాం. అవి అంచనాలు అందుకుంటే సేఫ్. డివైడ్ టాక్ తెచ్చుకుంటే అంతే సంగతులు. ఈ ఇయర్ రిలీజైన రాధే శ్యామ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. పాన్ ఇండియా సినిమా కాబట్టి దాదాపు 202 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది ప్రభాస్ మూవీ. కానీ 80 కోట్ల కలెక్షన్స్ దగ్గరే రాధేశ్యామ్ కి బ్రేక్ పడింది. బయ్యర్లకు 60 శాతం నష్టాన్ని తీసుకొచ్చింది. 120 కోట్ల లాస్ తో అతిపెద్ద డిజాస్టర్ అనిపించుకుంది.
South Movies: బాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న సౌత్.. మనోజ్ బాజ్‌పేయి కామెంట్స్!
ఏప్రిల్ 29న విడుదలై.. రిలీజ్ అయిన రోజే నెగెటివ్ టాక్ మూటకట్టుకున్న సినిమా ఆచార్య. చిరూ, చరణ్ కలిసి వచ్చారంటే సినిమా ఎలా ఉన్నా మెగాఫ్యాన్స్ ఆదరిస్తారనుకున్నారు. బట్ ఆచార్య అందరి అంచనాలను తలకిందులు చేసి చిరూ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ ముద్ర వేసుకుంది. దాదాపు 133 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. అయితే 45 కోట్ల షేర్ రాబట్టడానికే అవస్థలు పడింది. ఫైనల్‌గా ఆచార్య 80 కోట్ల వరకు బయ్యర్స్‌కు నష్టాలను తెచ్చిపెట్టింది.
Postpone Movies: ఇదిగో అదిగో అంటున్నా.. ధియేటర్లోకి రాని సినిమాలు!
ప్రభాస్, చిరూ తర్వాత భారీ ఫ్లాప్ లిస్ట్ లో పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి ఉంది. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 124 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అత్తారింటికి దారేది తర్వాత పవన్ – త్రివిక్రమ్ కాంబో కాబట్టి ఫ్యాన్స్ ఊగిపోయారు. తీరా చూస్తే ఎవ్వర్నీ ఏమాత్రం మెప్పించలేక 57 కోట్ల షేర్ దగ్గరే ఆగిపోయింది. మొత్తంగా 66 కోట్లతో గతేడాది వరకు టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అనే పేరును అజ్ఞాతవాసి ట్యాగ్ లైన్ గా తగిలించుకుంది.
South Movies: హిందీలో సౌత్ సినిమాల రికార్డులు.. నోరుపారేసుకుంటున్న బాలీవుడ్ క్రిటిక్స్!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ్ బిగ్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన సినిమా స్పైడర్. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రెడీ చేశారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ తరహాలో ఈ సినిమా ఉండబోతుందన్నట్టు ఫోజులు కొట్టారు. అందుకే తెలుగులో దాదాపు 107 కోట్లు.. తమిళంలో 18కోట్లు.. మొత్తంగా రెండు భాషల్లో కలిసి 124 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది స్పైడర్. చివరికి ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ 64 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. అంటే స్పైడర్ పై నమ్మకం పెట్టుకున్న వారికి దాదాపు 60 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
Postponed Movies: అటకెక్కిన సినిమాలు.. సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం!
బాహుబలితో ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరగడం.. బాహుబలి2 తర్వాత వస్తున్న సినిమా కావడంతో సాహోపై సహజంగానే ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉంటాయి. సుజిత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో సాహో తెరకెక్కింది. టాలీవుడ్ లో ఈ మూవీ దాదాపు 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. విడుదలయ్యాక 219 కోట్ల షేర్ రాబట్టి.. మొత్తంగా ఈ సినిమా 52 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. కానీ బాలీవుడ్ లో 100 కోట్లు రాబట్టి అక్కడ సాహో హిట్ అనిపించుకుంది.
Bollywood Movies: బాలీవుడ్ కి చేతకావట్లేదా? సౌత్ ను చూసి నేర్చుకోవాల్సిందేనా?
లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ బయోగ్రఫీ అంటే కలెక్షన్ల వర్షం కురుస్తుందనుకున్నారు. బాలకృష్ణను ఆయన తండ్రి పాత్రలో చూపించి రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోగ్రఫీని తెరకెక్కించాడు క్రిష్. కానీ కథానాయకుడు, మహానాయకుడు రెండు ఊహించని దెబ్బతీసాయి. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన కథానాయకుడు 70 కోట్ల బిజినెస్ చేయగా 20 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఓవరాల్ గా 50 కోట్ల లాస్ తీసుకొచ్చింది. నెక్ట్స్ 30 కోట్ల బడ్జెట్ తో వచ్చిన మహానాయకుడు 51కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కానీ 5 కోట్ల షేర్ మాత్రమే సంపాదించింది. మొత్తంగా మహానాయకుడు 46 కోట్ల మహా నష్టాన్నే మిగిల్చాడు.
Malty starrer Movies: వచ్చేస్తున్న టాప్ స్టార్ మల్టీస్టారర్ కాంబినేషన్స్!
మెగాస్టార్ ఫ్యాన్స్ కి నచ్చినా చివరికి బయ్యర్లకు మాత్రం నష్టాన్ని తెచ్చిన సినిమా సైరా. చిరంజీవి టైటిల్ రోల్‌లో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా.. ఇలా భారీ కాస్ట్ తో సైరా నరసింహారెడ్డిని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. 270 కోట్ల బడ్జెట్‌ను ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించాడు నిర్మాత రామ్ చరణ్. తెలుగులో 143 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా మిగిలిన అన్ని భాషల్లో కలిపి 44 కోట్ల పైగానే సైరాను అమ్మారు. ఓవరాల్‌గా ఈ సినిమా 143 కోట్లను మించిన షేర్ రాబట్టింది. కానీ టార్గెట్ రీచ్ కాలేక 43న్నర కోట్ల నష్టాలతో ఆట ముగించింది.
Star Heroes Movies: కేజీఎఫ్ టెర్రర్.. అంతకుమించిన అంచనాలతో కొత్త సినిమాలు!
సుకుమార్, మహేశ్ కొత్తగా ట్రై చేశారు. కొంతమందికి వన్ నేనొక్కడినే నచ్చింది కూడా. కానీ మేజర్ ఆడియెన్స్ జడ్జిమెంట్ తేడాకొట్టింది. 72 కోట్ల గ్రాండ్ బిజినెస్ చేసిన నేనొక్కడినే 30 కోట్ల కలెక్షన్స్ దగ్గరే ఆగింది. ఈ మూవీ తర్వాత మహేశ్ లిస్ట్ లో ఉన్న మరో ఫ్లాప్ బ్రహ్మోత్సవం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత శ్రీకాంత్ అడ్డాల, మహేశ్ కాంబినేషన్ మూవీ కానీ కంటెంట్ సరిగాలేక డిజాస్టర్ గా మిగిలింది. సూపర్ స్టార్ కి తోడూ ముగ్గురు హీరోయిన్లు, తెరనిండా కనిపించే పెద్ద పెద్ద ఆర్టిస్టులు.. అడుగడుగునా రిచ్ నెస్.. అయినా సరే 39 కోట్ల నష్టాన్నే బ్రహ్మోత్సవం జేబులో వేసుకుంది.
Tamil Movies: అరవ హీరోల రొటీన్ ఫార్ములా.. ఎన్నాళ్లీ రొడ్డకొట్టుడు సామీ!
ఇవే కాదు గబ్బర్ సింగ్ పేరు చెప్పుకుని వచ్చిన పవన్ కల్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ 37 కోట్ల లాస్ తీసుకొచ్చింది. గ్రాండ్ గా ఉంటుందనుకున్న అక్కినేని వారసుడి లాంచింగ్ మూవీ అఖిల్ 28 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. పవర్ స్టార్ కొమరం పులి 26 కోట్లు, కాటమరాయుడు 25 కోట్లు.. రామ్ చరణ్ వినయ విధేయ రామ, ఆరెంజ్ చెరో 26 కోట్లు.. జంజీర్, బ్రూస్లీ చెరో 25 కోట్ల భారీ నష్టాలతో ఫ్యాన్స్ ఆశలతో ఆడుకున్నాయి. మహేశ్ ఆగడు, తారక్.. శక్తి, రామయ్య వస్తావయ్యా, వెంకీ షాడో, సాయిధరమ్ తేజ్ ఇంటలిజెంట్, నితిన్ లై, నాగ్ ఓం నమో వేంకటేశాయ ఇలాంటి డిజాస్టర్స్ టాలీవుడ్ హిస్టరీలో చాలానే ఉన్నాయి.
- Telugu Movies: ఒకరిపై ఒకరు నెగెటివ్ దుమారం.. బూమ్‌రాగ్ అవుతున్న సినిమాలు!
- Ticket Rates: పెరిగిన టికెట్ రేట్లు.. సినిమాకు వరమా.. శాపమా?
- Salaar: అప్పుడు రాధేశ్యామ్.. ఇప్పుడు సలార్ ఇంత లేట్ ఏంటి మాస్టారు?
- Acharya: ఆచార్య 13 రోజుల వసూళ్లు.. హాఫ్ సెంచరీకి కూతవేటు దూరం!
- Telugu Movies: మాస్ ఆడియెన్స్ ఆదరణ లేదా.. రాధేశ్యామ్, ఆచార్య రిజల్టే!
1IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
2Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
3IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
4Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
5NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
6She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
7Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
8Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు
9Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్.. ఆందోళనలో అభ్యర్థులు
10Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!