95th Oscar Nominations : 95వ అకాడమీ అవార్డ్స్ లో అత్యధిక ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్న సినిమాలు..

ప్రతి సంవత్సరం కొన్ని సినిమాలు ఒకటి కంటే చాలా ఎక్కువ నామినేషన్స్ సాధిస్తాయి. కొన్ని సినిమాలు ఏకంగా 10 కి పైగా విభాగాల్లో నామినేషన్స్ సాధిస్తాయి. అత్యధికంగా ఇప్పటివరకు టైటానిక్, ల ల లాండ్, ఆల్ అబౌట్ ఐ సినిమాలు 14 ఆస్కార్ నామినేషన్స్ సాధించాయి. ఆ తర్వాత.....................

95th Oscar Nominations :  95వ అకాడమీ అవార్డ్స్ లో అత్యధిక ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్న సినిమాలు..

Movies which get highest Oscar Nominations in 95th Academy awards

95th Oscar Nominations :  ప్రపంచంలోని సినిమా వాళ్లంతా వేచి చూసిన ఆస్కార్ నామినేషన్స్ మంగళవారం నాడు ప్రకటించారు. ప్రపంచంలోని అన్ని సినీ పరిశ్రమలు ఈ నామినేషన్స్ కోసం ఎదురుచూశాయి. ఈ సారి మన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుండటంతో ఇండియన్ సినీ ప్రేక్షకులంతా ఈ నామినేషన్స్ లో RRR సినిమా ఉండాలని కోరుకున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట మాత్రమే RRR నుంచి ఆస్కార్ బరిలో నిలిచింది.

ప్రతి సంవత్సరం కొన్ని సినిమాలు ఒకటి కంటే చాలా ఎక్కువ నామినేషన్స్ సాధిస్తాయి. కొన్ని సినిమాలు ఏకంగా 10 కి పైగా విభాగాల్లో నామినేషన్స్ సాధిస్తాయి. అత్యధికంగా ఇప్పటివరకు టైటానిక్, ల ల లాండ్, ఆల్ అబౌట్ ఐ సినిమాలు 14 ఆస్కార్ నామినేషన్స్ సాధించాయి. ఆ తర్వాత 13,12, 11 నామినేషన్స్ సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ సంవత్సరం అత్యధికంగా ఆస్కార్ నామినేషన్స్ సాధించిన సినిమాలు ఇవే…

Everything Everywhere All at Once – 11 నామినేషన్స్ సాధించింది. Best Picture, Best Actress, Best Supporting Actor, Best Supporting Actress, Best Supporting Actress, Best Costume Design, Best Directing, Best Film Editing, Best Original Score, Best Original Song, Best Original Screenplay విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. ఈ సినిమా నుంచి Best Supporting Actress కి ఇద్దరు నామినేట్ అవ్వడం విశేషం.

All Quiet on the Western Front – 9 నామినేషన్స్ సాధించింది. Best Picture, Best International Feature Film, Best Adapted Screenplay, Best Cinematography, Best Makeup and Hair styling, Best Original Score, Best Production Design, Best Sound, Best Visual Effects విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.

The Banshees of Inisherin – 9 నామినేషన్స్ సాధించింది. Best Picture, Best Actor, Best Supporting Actor, Best Supporting Actor, Best Supporting Actress, Best Directing, Best Film Editing, Best Original Score, Best Original Screenplay విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.

Elvis – 8 నామినేషన్స్ సాధించింది. Best Picture, Best Actor, Best Cinematography, Best Costume Design, Best Film Editing, Best Makeup and Hair styling, Best Production Design, Best Sound విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.

The Fabelmans – 7 నామినేషన్స్ సాధించింది. Best Picture, Best Actress, Best Supporting Actor, Best Directing, Best Original Score, Best Production Design, Best Original Screenplay విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.

Tár – 6 నామినేషన్స్ సాధించింది. Best Picture, Best Actress, Best Cinematography, Best Directing, Best Film Editing, and Best Original Screenplay విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.

Top Gun: Maverick – 6 నామినేషన్స్ సాధించింది. Best Picture, Best Adapted Screenplay, Best Film Editing, Best Original Song, Best Sound, and Best Visual Effects విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.

Oscar Best Picture Nominations : ఆస్కార్ బెస్ట్ పిక్చర్ కి నామినేట్ అయిన 10 సినిమాలు ఇవే.. ఎక్కడ చూడొచ్చు??

అవతార్ 2 సినిమా కేవలం నాలుగు విభాగాల్లోనే నామినేట్ అవడం గమనార్హం. Best Picture, Best Production Design, Best Sound, Best Visual Effects విభాగాల్లో మాత్రమే అవతార్ ఆస్కార్ కి నామినేట్ అయింది. మరి ఈ సంవత్సరం ఎక్కువగా ఏ సినిమా అవార్డులు గెలుచుకుంటుందో చూడాలి.