Mrunal Thakur: నానితో రొమాన్స్‌కు రెడీ అయిన సీత..?

టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల్లో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకుంది అందాల భామ మృణాల్ ఠాకూర్. అప్పటివరకు పలు బాలీవుడ్ సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క ‘సీతారామం’తో దక్కించుకుంది ఈ బ్యూటీ. ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా బ్లాక్‌బస్టర్ కావడంతో మృణాల్ నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Mrunal Thakur: నానితో రొమాన్స్‌కు రెడీ అయిన సీత..?

Mrunal Thakur To Romance Nani

Mrunal Thakur: టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల్లో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకుంది అందాల భామ మృణాల్ ఠాకూర్. అప్పటివరకు పలు బాలీవుడ్ సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క ‘సీతారామం’తో దక్కించుకుంది ఈ బ్యూటీ. ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా బ్లాక్‌బస్టర్ కావడంతో మృణాల్ నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Mrunal Thakur : మనకి ఎంత రెమ్యునరేషన్ కావాలో మనం అడగాలి.. అస్సలు మొహమాట పడకూడదు..

ఈ క్రమంలోనే మృణాల్ నేచురల్ స్టార్ నానితో రొమాన్స్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా నాని తన మైల్‌స్టోన్ మూవీగా తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని అనౌన్స్ చేయబోతున్నట్లు తెలిపాడు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ న్యూ ఇయర్ రోజున ఇవ్వబోతున్నాడు ఈ హీరో. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ నటించనుందనే వార్త సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

సీతారామంలో దుల్కర్ సల్మాన్‌తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ నటనకు నాని కూడా ఫిదా అయ్యాడని.. అందుకే తన నెక్ట్స్ మూవీలో ఆమెను హీరోయిన్‌గా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో నిజంగానే మృణాల్ నటిస్తే, నానితో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అని నాని, మృణాల్‌ల అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారా.. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా.. నిజంగానే ఈ సినిమాలో మృణాల్ నటించబోతుందా అనే విషయాలపై జనవరి 1న క్లారిటీ రానుంది.