RC16 Heroine : రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలో సీతారామం హీరోయిన్?

తాజాగా RC16 సినిమాలో రామ్ చరణ్ పక్కన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ‘సీతారామం’ లాంటి సూపర్ లవ్ స్టోరీలో దుల్కర్ సల్మాన్ జోడీగా మృణాళ్ ఠాకూర్ అద్భుతంగా నటించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత....................

RC16 Heroine :  RRR తర్వాత రామ్ చరణ్ స్థాయి అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు చరణ్ పాన్ ఇండియా స్టార్. ప్రస్తుతం రామ్ చరణ్ RC15 సినిమా శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్టు గా భారీగా దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇక ఈ సినిమా తర్వాత RC16 బుచ్చిబాబు దర్శకత్వంలో ఇప్పటికే ప్రకటించారు. అయితే రామ్ చరణ్ పూర్తిస్థాయి లవ్ స్టోరీలో నటించి చాలా కాలమైంది. ఇప్పడు మళ్ళీ చెర్రీ మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయబోతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ 16వ సినిమాగా అనౌన్స్ అయిన బుచ్చిబాబు సాన మూవీ లవ్ స్టోరీ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో చాలా కాలం తర్వాత చరణ్ పూర్తిస్థాయిలో లవ్ స్టోరీలో నటించనున్నట్టు తెలుస్తుంది.

తాజాగా RC16 సినిమాలో రామ్ చరణ్ పక్కన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ‘సీతారామం’ లాంటి సూపర్ లవ్ స్టోరీలో దుల్కర్ సల్మాన్ జోడీగా మృణాళ్ ఠాకూర్ అద్భుతంగా నటించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత నటన, అందంలో మృణాల్ కి బాగానే మార్కులు పడటంతో టాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయట. కానీ మృణాల్ ఆలోచించి, స్క్రిప్ట్స్ విని సెలెక్ట్ చేసుకుంటోంది. సీతారామం సినిమా తర్వాత కొంచెం టైం తీసుకుని నాని సరసన నాని 30వ సినిమా ఒప్పుకుంది. ఇటీవలే ఈ సినిమా షూట్ మొదలయినట్టు సమాచారం.

Dadasaheb Phalke Awards : దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2023 గ్రహీతలు..

మృణాల్ ఠాకూర్ ఇప్పుడు రామ్ చరణ్ సరసన RC16 సినిమా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఉప్పెన లాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీని తెరకెక్కించి 100 కోట్లు కొల్లగొట్టిన డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఈ సారి కూడా మెగా పవర్ స్టార్ తో మంచి లవ్ స్టోరీని తీయబోతున్నట్టు తెలుస్తోంది. మరి చరణ్ పక్కన మృణాల్ ఠాకూర్ తో బుచ్చిబాబు ఎలాంటి సినిమా తీస్తాడో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. చరణ్ పక్కన మృణాల్ ఓకే అయితే మంచిదే, కొత్త కాంబినేషన్ అవుతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.

ట్రెండింగ్ వార్తలు