MS Raju : స్టార్ హీరోల డేట్స్ ఉన్నా వాళ్ళతో సినిమా చేయను..

MS రాజు మాట్లాడుతూ.. ''కొన్ని ఏళ్ళ క్రితం గుణశేఖర్‌, మీరూ, నేను కలిసి చేద్దామండీ అని రవితేజ అడిగారు. ఆ కథ విని కుదరదని చెప్పేశా. ఆ సినిమా నిప్పు. త్రివిక్రమ్‌తో కలిసి సినిమా చేద్దామని మహేశ్‌బాబు..............

MS Raju : స్టార్ హీరోల డేట్స్ ఉన్నా వాళ్ళతో సినిమా చేయను..
ad

MS Raju :  ఒకప్పుడు వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. లాంటి ఎన్నో హిట్‌ సినిమాలను అందించిన బడా నిర్మాత MS రాజు. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా ఉన్న ఈయన మధ్యలో దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలు తీశారు. ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు. పెద్ద నిర్మాత అయినా, స్టార్ హీరోల డేట్స్ ఉన్నా స్టార్ హీరోలతో సినిమాలు చేయను అంటున్నారు MS రాజు.

BoyapatiRAPO: తమ సినిమాకు రెమ్యునరేషన్ వదులుకున్న బోయపాటి-రామ్‌లు

 

తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన MS రాజు ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పుడు ఉన్న పెద్ద హీరోలతో సినిమాలు ఎందుకు చెయ్యట్లేదు అని అడగగా MS రాజు మాట్లాడుతూ.. ”కొన్ని ఏళ్ళ క్రితం గుణశేఖర్‌, మీరూ, నేను కలిసి చేద్దామండీ అని రవితేజ అడిగారు. ఆ కథ విని కుదరదని చెప్పేశా. ఆ సినిమా నిప్పు. త్రివిక్రమ్‌తో కలిసి సినిమా చేద్దామని మహేశ్‌బాబు అడిగినా కూడా చేయనన్నాను. అలా ఖలేజా వదిలేశాను. ఆ తర్వాత అల్లు అర్జున్‌ రుద్రమదేవి కూడా నా దగ్గరకు వచ్చింది, దాన్ని కూడా వద్దనుకున్నాను. మహేశ్‌, ప్రభాస్‌ లాంటి స్టార్ హీరోలు సినిమా చేద్దామన్నా నేను వారితో చేయను. డేట్స్ ఉన్నా సరే చేయను. నేను స్టార్‌ హీరోల కన్నా కథనే ఎక్కువగా నమ్ముతాను. కథని నమ్మి తీసిన చిన్న సినిమాలే ఎక్కువ విజయం సాధించాయి. నాకు పెద్ద సినిమాల కంటే కూడా మనసంతా నువ్వే సినిమాతోనే ఎక్కువ లాభాలొచ్చాయి. అందుకే నేను స్టార్ హీరోలు కదా అని ఏ కథ పడితే ఆ కథతో సినిమా తీసేయను” అని తెలిపారు.