Muddy: దిల్ రాజు చేతికి తెలుగు రైట్స్.. బొమ్మ పక్కా హిట్టా?

ఇండియన్ సినిమా మేకింగ్ స్టైల్ మారింది.. కథా ఎంపిక అంతకన్నా ఎక్కువగా చేంజ్ కనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా కొత్తరకం కథలను భాషాభేదం లేకుండా ఆదిరిస్తూనే ఉన్నారు. భాషాభేదం లేకుండా...

Muddy: దిల్ రాజు చేతికి తెలుగు రైట్స్.. బొమ్మ పక్కా హిట్టా?

Muddy

Muddy: ఇండియన్ సినిమా మేకింగ్ స్టైల్ మారింది.. కథా ఎంపిక అంతకన్నా ఎక్కువగా చేంజ్ కనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా కొత్తరకం కథలను భాషాభేదం లేకుండా ఆదిరిస్తూనే ఉన్నారు. భాషాభేదం లేకుండా ప్రతీ సినిమాను ఆదరిస్తున్న తరుణంలో మేకర్స్ కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు. అలా పాన్ ఇండియా మూవీగా.. 5 భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది మడ్ రేస్ మూవీ ‘మడ్డీ’. ప్రపంచంలోనే అరుదైన మడ్ రేసింగ్ కాన్సెప్ట్ తో మొట్టమొదటి ఇండియన్ ఆఫ్-రోడ్ మడ్ రేస్ సినిమా మడ్డీ ఎప్పుడో అటెన్షన్ క్రియేట్ చేసింది.

Disha Patani: అందమైన ముఖాన్ని పాడుచేసుకున్నావా.. దిశాకి ట్రోలింగ్!

ఇప్పటి వరకు కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఆఫ్ రోడ్ మడ్ రేసింగ్ క్రీడల గురించి ఎంతో రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించిన ఈ సినిమాతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా కేజీఎఫ్ లాంటి సినిమాకి సంగీతాన్ని అందించి ఆ సినిమా విజయంలో కీలకంగా మారిన రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ ఫేమ్ కె జి రతీష్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా సాహసోపేతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. డిసెంబర్ 10న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ. ఇంగ్లీషుతో సహా 6 భాషల్లో ఈ సినిమా విడుదలకి సిద్దం అవుతోంది.

Bangarraju: శృతి మించిన బడ్జెట్.. సీక్వెల్ హిట్‌పైనే నాగ్ ఆశలన్నీ!

కాగా.. మ్యాటర్ ఉన్న సినిమాని ఎక్కడ ఉన్నా గాలమేసి పట్టుకొచ్చే నిర్మాత, డిస్టిబ్యూటర్ దిల్ రాజు ఈ సినిమా తెలుగు హక్కులు సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ సినిమా పక్కా హిట్ అనే టాక్ అప్పుడే మొదలైంది. నవంబర్ 30 సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనుండగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం, ఫ్యామిలీ డ్రామా, కామెడీ ఇలా ప్రతి ఎమోష‌న్ ఈ మూవీలో ఉంటుందని.. అందుకే దిల్ రాజు ఏరికోరి ఈ సినిమా డిస్టిబ్యూట్ చేస్తున్నాడని చెప్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో థియేటర్లోకి వచ్చేవరకు వేచిచూడాల్సిందే.