Mahesh Babu : బాలీవుడ్ పై మహేష్ వ్యాఖ్యలు.. తప్పేమి లేదు అంటున్న బాలీవుడ్ సీనియర్ యాక్టర్ | mukesh bhatt speaks about mahesh comments on bollywood

Mahesh Babu : బాలీవుడ్ పై మహేష్ వ్యాఖ్యలు.. తప్పేమి లేదు అంటున్న బాలీవుడ్ సీనియర్ యాక్టర్

తాజాగా మహేష్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ ప్రముఖ సీనియర్ నటుడు ముకేశ్‌ భట్‌ స్పందించారు. ముకేశ్ భట్ మాట్లాడుతూ.. ''తనకు కావాల్సినంత సౌకర్యం బాలీవుడ్‌ ఇవ్వట్లేదు అని అనుకోవడంలో తప్పులేదు. మహేష్ ఎంతో............

Mahesh Babu : బాలీవుడ్ పై మహేష్ వ్యాఖ్యలు.. తప్పేమి లేదు అంటున్న బాలీవుడ్ సీనియర్ యాక్టర్

Mahesh Babu :  సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే మేజర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఓ విలేఖరి బాలీవుడ్ లోకి మీరెపుడు అడుగుపెడతారు అని అడిగిన ప్రశ్నకి బాలీవుడ్ నన్ను భరించలేదు, నాకు తెలుగులోనే హాయిగా ఉంది అని సమాధానం ఇచ్చారు. అయితే ఈ మాటలు తప్పుగా ప్రచారం అవ్వడంతో వివాదం చెలరేగింది. కొంతమంది ఈ వ్యాఖ్యలపై మహేష్ ని విమర్శించారు.

దీంతో మహేష్ మరో ఇంటర్వ్యూలో వీటిపై వివరణ ఇచ్చారు. మహేష్ మాట్లాడుతూ.. ”మన తెలుగు సినిమాలు అన్ని చోట్లకి వెళ్తున్నాయి. మన సినిమానే బాలీవుడ్ కి రీచ్ అవుతుంది. రాజమౌళి కాంబినేషన్ లో వచ్చేది పాన్ ఇండియా సినిమానే. అది బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. నాకు అన్ని భాషల మీద గౌరవం ఉంది. నాకు తెలుగులో కంఫర్ట్ గా ఉంది అని చెప్పాను” అంటూ తెలిపారు.

 

Salman Khan : ఆ వ్యాధి వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..

తాజాగా మహేష్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ ప్రముఖ సీనియర్ నటుడు ముకేశ్‌ భట్‌ స్పందించారు. ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ చేసిన వ్యాఖ్యలపై ముకేశ్ భట్ మాట్లాడుతూ.. ”తనకు కావాల్సినంత సౌకర్యం బాలీవుడ్‌ ఇవ్వట్లేదు అని అనుకోవడంలో తప్పులేదు. మహేష్ ఎంతో ప్రతిభావంతుడు. అతడి ప్రయాణాన్ని నేను గౌరవిస్తాను. అతను ఆల్రెడీ సక్సెస్ అయినా హీరో. అతని అంచనాలని బాలీవుడ్ అందుకోలేకపోతే తప్పేమి లేదు. అది అతని ఆలోచన దృక్పథం” అని అన్నారు. మరి మహేష్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాక కూడా మాట్లాడుతున్నారు అంటే ఈ వివాదం సద్దుమణుగుతుందో లేక బాలీవుడ్ నుంచి మరెవరైనా స్పందిస్తారో చూడాలి.

×