Mukhachitram: సెన్సార్ పనులు ముగించుకున్న విశ్వక్ సేన్ ‘ముఖచిత్రం’..!

‘కలర్ ఫోటో’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ అందిస్తున్న తాజా చిత్రం ‘ముఖచిత్రం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సందీప్ రాజ్ అందిస్తుండగా ఈ చిత్రాన్ని గంగాధర్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Mukhachitram: ‘కలర్ ఫోటో’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ అందిస్తున్న తాజా చిత్రం ‘ముఖచిత్రం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సందీప్ రాజ్ అందిస్తుండగా ఈ చిత్రాన్ని గంగాధర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

Mukhachitram : విశ్వక్‌సేన్ ముఖ్యపాత్రలో.. ప్లాస్టిక్ సర్జరీ కాన్సెప్ట్ తో అదిరిపోయే థ్రిల్లర్.. ‘ముఖచిత్రం’ ట్రైలర్ రిలీజ్..

కాగా, ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు ‘A’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. పూర్తి యాక్షన్, మిస్టరీ డ్రామాగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దిందట. వికాస్ వశిష్ట, చైతన్య రావు, ప్రియా వడ్లమాని, సునీల్, రవిశంకర్ తదితరులు ఈ సినిమాలో నటిస్తుండగా, ఈ సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను ఉత్కంఠానికి గురిచేస్తాయని చిత్ర యూనిట్ అంటోంది. డిసెంబర్ 9న వస్తున్న ముఖచిత్రం సినిమా ప్రేక్షకులను ఎంతమేర అలరిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు