Actress Suicide : యువ నటి ఆత్మహత్య.. డ్రగ్స్ కేసు భయంతో దారుణం

ముంబైలో దారుణం జరిగింది. ఓ భోజ్ పురి యువ నటి (28) ఆత్మహత్య చేసుకుంది. డ్రగ్స్ కేసు భయంతో ఆమె ఈ పని చేసింది.

Actress Suicide : యువ నటి ఆత్మహత్య.. డ్రగ్స్ కేసు భయంతో దారుణం

Bhojpuri Actress Suicide

Actress Suicide : ముంబైలో దారుణం జరిగింది. ఓ భోజ్ పురి యువ నటి (28) ఆత్మహత్య చేసుకుంది. డ్రగ్స్ కేసు భయంతో ఆమె ఈ పని చేసింది. ఈ కేసుకి సంబంధించిన వివరాలను ముంబై అంబోలీ పోలీసులు తెలిపారు. యువ నటి ఓ రేవ్ పార్టీలో పాల్గొంది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు.

Union Bank of India Jobs : యూనియన్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ వివరాలు

తాము ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులం అంటూ అబద్దం చెప్పారు. రేవ్ పార్టీలో ఉన్నవారిని బెదిరించారు. డ్రగ్స్ కేసులో నీ పేరు వెల్లడించకుండా ఉండాలంటే రూ.20లక్షలు ఇవ్వాలని నటిని డిమాండ్ చేశారు. ఆ తర్వాత పదే పదే ఫోన్ చేసి ఆమెను బెదిరించారు, భయపెట్టారు. ఈ వేధింపులతో నటి బాగా ఆందోళనకు గురైంది. దీని నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. అంత డబ్బు ఇచ్చుకోలేక, పరువు పోతుందనే భయంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. కాగా, పోలీసులు ఆ నటి పేరు మాత్రం వెల్లడించలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముంబైకి చెందిన నిందితులు సూరన్, పర్వేశ్ లను అరెస్ట్ చేశారు.

Robo : రోబో సినిమా నిజం కానున్నదా?

రేవ్ పార్టీలో నటితో పాటు పాల్గొన్న ఆరిఫ్ గజీ అనే వ్యక్తి దీనికి సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు వ్యక్తులను ఎన్సీబీ అధికారులుగా పంపి డబ్బు డిమాండ్ చేయించింది ఆరిఫ్ అని పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో ఇంకా పలువురు పాల్గొన్నారు. వారందరిని ఆ ఇద్దరు వ్యక్తులు బ్లాక్ మెయిల్ చేశారు. కేసులో పేర్లు రాకుండా ఉండాలంటే రూ.40లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.