ముంబై సాగా – షూటింగ్ ప్రారంభం

జాన్ అబ్రహాం, కాజల్ అగర్వాల్, ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి, ప్రతిక్ బబ్బర్ ప్రధాన తారాగణంగా రూపొందనున్న 'ముంబై సాగా' షూటింగ్ ప్రారంభం..

  • Published By: sekhar ,Published On : August 28, 2019 / 09:20 AM IST
ముంబై సాగా – షూటింగ్ ప్రారంభం

జాన్ అబ్రహాం, కాజల్ అగర్వాల్, ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి, ప్రతిక్ బబ్బర్ ప్రధాన తారాగణంగా రూపొందనున్న ‘ముంబై సాగా’ షూటింగ్ ప్రారంభం..

బాలీవుడ్‌లో భారీ తారాగణంతో మరో మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. సంజయ్ గుప్తా దర్శకత్వంలో, టీ-సిరీస్, వైట్ ఫీథర్ ఫిలింస్ నిర్మాణంలో ‘ముంబై సాగా’ అనే సినిమా తెరకెక్కుతుంది. యాక్షన్ డ్రామాగా  రూపొందబోయే ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా స్టార్ట్ అయ్యింది.

జాన్ అబ్రహాం, కాజల్ అగర్వాల్, ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి, ప్రతిక్ బబ్బర్, గుల్షన్ గ్రోవర్, రోహిత్ రాయ్, సమీర్ సోనీ, అమోల్ గుప్తా ప్రధన తారగణంగా నటిస్తున్నారు. 1980, 1990వ దశకంలో ముంబైలో గ్యాంగ్ స్టర్స్ మధ్య జరిగే కథ ఇది.

Read Also : శర్వానంద్ కొత్త సినిమా ప్రారంభం..

ప్రస్తుతం నటీనటుల సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది, త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, 2020 జూన్ 19న సినిమాను విడుదల చెయ్యనున్నారు. సిసిమాటోగ్రఫీ : షికర్ భట్నాగర్.