Anushka Shetty : అనుష్క సోదరుడి హత్యకు కుట్ర.. హోంమంత్రిని ఆశ్రయించిన అనుష్క సోదరుడు..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రస్తుతం చాలా గ్యాప్ తో అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంది. అనుష్క ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అనుష్కకి ఇద్దరు సోదరులు............

Anushka Shetty : అనుష్క సోదరుడి హత్యకు కుట్ర.. హోంమంత్రిని ఆశ్రయించిన అనుష్క సోదరుడు..

Anushka Shetty

Anushka Shetty :  ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి కర్ణాటక మంగుళూరుకి చెందిన అమ్మాయి అని అందరికి తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రస్తుతం చాలా గ్యాప్ తో అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంది. అనుష్క ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అనుష్కకి ఇద్దరు సోదరులు ఉన్నారు. అందులో అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్‌ శెట్టి హత్యకి కుట్ర పన్నుతున్నారని సమాచారం.

 

కర్ణాటకలో ముత్తప్పరై అనే గ్యాంగ్‌స్టర్ దగ్గర అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్‌ శెట్టి పని చేసేవాడు. అతని దగ్గరే మన్విత్‌ రై అనే వ్యక్తి కూడా పని చేసేవాడు. వీరిద్దరూ ముత్తప్పరై దగ్గర కుడి, ఎడమ భుజంలా ఉండేవారు. అయితే ముత్తప్పరై మరణించిన తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ముత్తప్పరై మరణించిన తర్వాత ఆయన స్థాపించిన జయ కర్ణాటక సంఘం నుంచి గుణరంజన్‌ బయటకు వచ్చి జయకర్ణాటక జనపర వేదికను స్థాపించి మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. అయితే అతని ఎదుగుదలని చూసి ఓర్వలేకే మన్విత్‌ రై తమ నేత హత్యకు కుట్ర పన్నాడని, చంపడానికి ప్రయత్నిస్తున్నాడని గుణరంజన్‌ అనుచరులు ఆరోపించారు.

Shirley Setia : రెండేళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న హీరోయిన్.. కరోనా వల్ల..

అలాగే కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి గుణరంజన్‌కు భద్రత కల్పించాలని కోరారు. ఈ ఆరోపణలను మన్విత్‌ రై తోసిపుచ్చి వారు చేస్తున్న ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయితే అనుష్క శెట్టిది గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ అని, తన సోదరుడు గ్యాంగ్‌స్టర్ అని తెలియడంతో ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.