బాలీవుడ్ లో మరో విషాదం : మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

  • Published By: madhu ,Published On : June 1, 2020 / 03:16 AM IST
బాలీవుడ్ లో మరో విషాదం : మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస మరణాలతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. 2020, మే 31వ తేదీ ఆదివారం రాత్రి ప్రముఖ బాలీవుడ్ సంగత దర్శకుడు వాజీద్ ఖాన్ (42) కన్నుమూశారు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆయన బాధ పడుతున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఈయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఇతరులు సంతాపం తెలియచేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. వాజీద్ ఖాన్ నవ్వును తామెప్పుడూ మరిచిపోలేమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు నటి ప్రియాంక చోప్రా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ సంతాపం తెలియచేశారు. 

బాలీవుడ్ ఫేమస్ సాజిద్ వాజిద్ లలో ఒకరైన వాజిద్ ఖాన్..బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలకు సంగీతం అందించారు. ఆయన సినిమాల్లోని బ్లాక్ బస్టర్ గా నిలిచిన…దబాంగ్, వాంటెడ్, ఏక్తా టైగర్ సినిమాలకు బాణీలు కట్టారు. సాజిద్ వాజిద్ ద్వయం లాక్ డౌన్ లో ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ ‘భాయ్ భాయ’ అంటూ ఓ పాటను విడుదల చేశారు. 

 

Read: 2 వేల మంది టీవీ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ ను ఆదుకున్న త‌ల‌సాని ట్రస్ట్