Adipurush : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం.. ముంబై నుంచి తిరుపతికి బైక్‌పై ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్..

మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ ద్వయం బాలీవుడ్ లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరిలో నుండి సంగీత స్వరకర్త అతుల్ ఇప్పుడు బైక్‌పై ముంబై నుంచి తిరుపతికి వెళ్లనున్నారు.

Adipurush : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం.. ముంబై నుంచి తిరుపతికి బైక్‌పై ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్..

Music Director Atul travelling Mumbai to Tirupati on bike for Adipurush pre release event

Music Director Atul : ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. ఇటీవలే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అవ్వగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో భారీగా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ అంతా హాజరు కానున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ ద్వయం బాలీవుడ్ లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరిలో నుండి సంగీత స్వరకర్త అతుల్ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పని చేయడానికి సిద్ధం అయిపోయాడు. ఈ ప్రముఖ సంగీత విద్వాంసుడు బైక్‌పై ముంబై నుంచి తిరుపతికి వెళ్లనున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తిరుపతిలో ఘనంగా జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యేందుకు ఇలాంటి కొత్త పనిని చేయనున్నారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ఇక అతుల్ నేడు జూన్ 3న ముంబైలో బయలుదేరి జూన్ 5న తిరుపతికి చేరుకోనున్నాడు. తిరుపతి చేరుకున్న తర్వాత, అతుల్ ఆయన సోదరుడు అజయ్ తో కలిసి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద జైశ్రీరామ్ పాటను సమర్పించనున్నారు.

Anushka Sharma : ఇకపై సంవత్సరానికి ఒక సినిమానే చేస్తా.. వాళ్ళ కోసమే ఈ నిర్ణయం..

సాధారణంగా, ఇలాంటి పనులు బైక్ రైడర్స్ చేస్తూ ఉంటారు. అయితే సంగీత రంగంలో తొలిసారిగా ఓ సంగీత విద్వాంసుడు సినిమాపై తనకున్న ప్రేమను చాటుకునేందుకు ఈ విధంగా ముంబై నుంచి తిరుపతికి బైక్ రైడ్ చేయబోతున్నాడు. ఇక ఇలాంటి వెరైటీ ప్రమోషన్ కూడా ఆదిపురుష్ సినిమాకి కలిసొస్తుంది అంటున్నారు అభిమానులు. మరోపక్క ప్రభాస్ అభిమానులు తిరుపతిలో ఆయనకు ఘనంగా స్వాగతం పలకడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నగరంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే అక్కడివారు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.