Samantha: నా కుటుంబం విచ్ఛిన్నమైంది.. సామ్ మనసులో ఇంత బాధ ఉందా?

చైతూతో బ్రేకప్ తర్వాత సినిమాల విషయంలో స్పీడ్ పెంచిన సామ్.. మరోవైపు తన ఎమోషనల్ జర్నీతోనూ ఫ్యాన్స్ ను టచ్ చేస్తోంది. ఇప్పుడైతే ఒకేసారి రకరకాల వేరియేషన్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్..

Samantha: నా కుటుంబం విచ్ఛిన్నమైంది.. సామ్ మనసులో ఇంత బాధ ఉందా?

Samantha

Samantha: చైతూతో బ్రేకప్ తర్వాత సినిమాల విషయంలో స్పీడ్ పెంచిన సామ్.. మరోవైపు తన ఎమోషనల్ జర్నీతోనూ ఫ్యాన్స్ ను టచ్ చేస్తోంది. ఇప్పుడైతే ఒకేసారి రకరకాల వేరియేషన్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఈ హీరోయిన్. ప్రొఫెషనల్ గా తన లెవలెంటో చూపించాలన్నది సమంతాలో కనిపిస్తోంది. ఆ ట్రైల్స్ లో ఆమెకు పుష్ప సాంగ్ రూపంలో ఫస్ట్ సక్సెస్ దక్కింది కూడా. ఇక ఫిట్ నెస్ కోసం ఎన్ని కసరత్తులు చేస్తుందో మెంటల్ స్ట్రెంత్ కోసం కూడా సమంతా అంతే కష్టపడుతోంది.

Samantha: నిన్ను నేను ప్రెగ్నెంట్ చేయనా.. సామ్‌పై శృతిమించిన నెటిజన్ క్వశ్చన్!

ఒకపక్క సినిమాలు చేస్తూ మరో పక్క విహార యాత్రలు చేస్తూ, ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. సమంత చేతిలో ప్రస్తుతం ఏడు సినిమాలు ఉన్నాయి. టూర్లు.. మెంటల్ స్ట్రెంత్ పెంచే యోగాలు.. బాడీ ఫిట్నెస్ కోసం వర్క్ ఔట్స్, యోగా ఇలా అన్నీ కలిపి ప్రస్తుతం సమంత ఫుల్ బిజీగా ఉంది. ఇక ఫ్రెండ్స్ తో కలిసి విహారయాత్రలు, లైఫ్ కొటేషన్స్.. బుక్స్ లోని పరమార్ధం కలిపి సోషల్ మీడియాలో కొటేషన్స్ కూడా షేర్ చేసుకుంటుంది. తాజాగా హాలీవుడ్‌ హాస్యనటుడు విల్‌ స్మిత్‌ పుస్తకం నుంచి ఓ కోట్‌ను షేర్‌ చేసింది.

Samantha: శాకుంతలం ఫస్ట్‌లుక్‌ చూశారా.. దేవకన్యలా సామ్!

అందులో సామ్ ‘గత 30 ఏళ్లుగా అందరిలాగే నేను కూడా వైఫల్యం, నష్టం, అవమానం, విడాకులు వంటి వాటిని ఫేస్‌ చేశాను. నాకు ప్రాణహాని ఉంది.. నా డబ్బు పోయింది.. నా ప్రైవసీని అతిక్రమించారు. నా కుటుంబం విచ్ఛిన్నమైంది’ అంటూ భావోద్వేగ లైన్స్ ను షేర్‌ చేసింది. ప్రతిరోజు ఇటుకను కాంక్రీట్ కలిపి పేర్చాలని మీరు ఏ దారిలో వెళ్తున్నా అక్కడ ఒక ఇటుక పేర్చేందుకు ఉంటుందని.. కానీ ఆ ఇటుకను పేర్చేందుకు నువ్వు లేచి నిలబడాలి అంటూ లైఫ్ లో బాధలు దాటి ముందుకెళ్లాలనే అర్ధం వచ్చేలా మరో పోస్ట్ చేసింది.

Samantha: సామ్ F**K టీ షర్ట్.. సోషల్ మీడియా రచ్చ రచ్చ!

కష్టపడి పని చేయండి.. మీకు తగిలిన ఎదురుదెబ్బల నుంచి నేర్చుకోండి.. మిమ్మల్ని మీరు చూసుకోండి.. మిమ్మల్ని మీరు ప్రతి రోజూ ఆవిష్కరించుకోండి అంటూ సమంత షేర్‌ చేసిన ఈ పోస్ట్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చైతూతో డైవర్స్ తర్వాత సామ్.. మనసులో ఇంత బాధ ఉందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆ బాధను మర్చిపోయేందుకే సామ్ టూర్లు, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ.. వీలైనంత త్వరగా సినిమాలతో బిజీ అయ్యేందుకు గట్టిగా కృషి చేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.