Rashmi Gautam: మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావచ్చు.. సుధీర్‌తో ఉన్న సంబంధంపై స్పందించిన రష్మీ..

బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై హీరోయిన్‌గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి "రష్మీ". టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షోతో ఈమె తెలుగువారికి బాగా దగ్గరయింది. ఇక అదే షోలో కాంటెస్ట్ గా చేసే సుధీర్ మరియు రష్మీల మధ్య లవ్ ట్రాక్ గురించి రెండు స్టేట్స్ లో తెలియని వారు ఉండరు. అయితే వీరిద్దరి మధ్య ఉన్నది నిజమైన ప్రేమా? లేక షో కోసం అలా చేస్తున్నారా? అనేది ఇప్పటికి ఒక తెలియని ప్రశ్న. తాజాగా ఈ ప్రశ్నకు రష్మీ ఇచ్చిన సమాధానం.. వారిద్దరి మధ్య ఉన్నదీ ప్రేమే అనేలా ఉంది.

Rashmi Gautam: మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావచ్చు.. సుధీర్‌తో ఉన్న సంబంధంపై స్పందించిన రష్మీ..

My relation with Sudheer can be love or anything

Rashmi Gautam: బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై హీరోయిన్‌గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి “రష్మీ”. టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షోతో ఈమె తెలుగువారికి బాగా దగ్గరయింది. ఇక అదే షోలో కాంటెస్ట్ గా చేసే సుధీర్ మరియు రష్మీల మధ్య లవ్ ట్రాక్ గురించి రెండు స్టేట్స్ లో తెలియని వారు ఉండరు. అయితే వీరిద్దరి మధ్య ఉన్నది నిజమైన ప్రేమా? లేక షో కోసం అలా చేస్తున్నారా? అనేది ఇప్పటికి ఒక తెలియని ప్రశ్న.

Bhola Shankar: భోళాశంకర్ సినిమాలో చిరుతో చిందేయనున్న రష్మీ..

తాజాగా ఈ ప్రశ్నకు రష్మీ ఇచ్చిన సమాధానం.. వారిద్దరి మధ్య ఉన్నదీ ప్రేమే అనేలా ఉంది. రష్మీ, నందు జంటగా నటించిన తాజా చిత్రం “బొమ్మ బ్లాక్ బస్టర్” ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మికి.. “రష్మి, సుధీర్‌ మధ్య ఉన్నది స్నేహమా, ప్రేమా? పెళ్లి అనే ఆలోచన ఏమైన ఉందా?” అనే ప్రశ్న ఎదురైంది.

రష్మీ బదులిస్తూ..”మా ఇద్దరిది పదేళ్ల ప్రయాణం. ఈ ప్రయాణంలో మేము ఏది అనుకుని చేయలేదు. సుధీర్, నేను ఆఫ్‌స్క్రీన్‌లో ఎలా ఉంటామో అదే ఆన్‌స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంది. మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావచ్చు. భవిష్యత్తులో ఏమి జరిగిన అది అందరికి తప్పక తెలుస్తుంది” అంటూ వ్యాఖ్యానించింది. గతంలో ఈ ప్రశ్న ఎదురుకున్న సమయంలో వారిద్దరి మధ్య ఉన్నది స్నేహమే అని చెప్పుకొచ్చిన రష్మీ ఇప్పుడు ఇలా మాట్లాడడంతో.. వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారు అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి ఈ జంట రానున్న రోజుల్లో ఎటువైపు పయనిస్తారో చూడాలి.