Pushpa: తగ్గేదేలే.. షూటింగ్ మొదలుపెట్టిన సుకుమార్!

స్టైలిష్ స్టార్ నుండి అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చేసిన సినిమా పుష్ప. మాజీ లెక్కల మాస్టారు సుకుమార్ అన్ని లెక్కలేసి పుష్పను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్స్ ఇప్పటికే సినిమాను ఓ లెవల్లో నిలబెట్టేశాయి.

Pushpa: తగ్గేదేలే.. షూటింగ్ మొదలుపెట్టిన సుకుమార్!

Pushpa

Pushpa: స్టైలిష్ స్టార్ నుండి అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చేసిన సినిమా పుష్ప. మాజీ లెక్కల మాస్టారు సుకుమార్ అన్ని లెక్కలేసి పుష్పను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్స్ ఇప్పటికే సినిమాను ఓ లెవల్లో నిలబెట్టేశాయి. బన్నీ పుట్టినరోజున విడుదల చేసిన టీజర్ ఇప్పటికీ యూట్యూబ్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది.

తెలుగుకు తోడు బన్నీకి మలయాళంలో మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో అక్కడి నటులను కూడా తీసుకొచ్చిన సుకుమార్ మొత్తంగా పుష్పను మల్టీ లాంగ్వేజెస్ ప్యాక్ గా మార్చేశాడు. అది చాలదని రెండు పార్టులుగా కూడా ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే.. అన్ని సినిమాల మాదిరి ఈ సినిమాకు కూడా కరోనా బ్రేకులు పడ్డాయి. ఒక దశలో మిగతా సినిమాలన్నీ కరోనా దెబ్బకు వాయిదా పడినా, హీరో అల్లు అర్జున్ కు కరోనా సోకినా సుకుమార్ షూటింగ్ మాత్రం ఆపలేదు.

కానీ, యూనిట్ లో వరసగా మరో ఇద్దరికీ కరోనా సోకడంతో ప్యాకప్ చెప్పేశారు. అయితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టింది. దీంతో మళ్ళీ సుకుమార్ ట్రాక్ మీదకెక్కారు. పుష్పరాజ్ ను బరిలో దించి షూటింగ్ మొదలు పెట్టారు. ఈ మేరకు షూటింగ్ పునఃప్రారంభించినట్లు నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ సినిమాను ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. దానికి ఇప్పుడు ఐదు వారాలు మాత్రమే సమయం ఉంది. మరి అప్పటికి సినిమాను సిద్ధం చేస్తారా అనేది చూడాల్సి ఉంది.