నరేష్‌ని ఎప్పుడూ ఇలా చూసుండరు – ‘నాంది’ కొత్తగా ఉందే!

అల్లరి నరేష్ నటిస్తున్న ‘నాంది’ రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది..

  • Published By: sekhar ,Published On : January 20, 2020 / 05:54 AM IST
నరేష్‌ని ఎప్పుడూ ఇలా చూసుండరు – ‘నాంది’ కొత్తగా ఉందే!

అల్లరి నరేష్ నటిస్తున్న ‘నాంది’ రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది..

యువ హీరోల్లో అల్లరి నరేష్ సినిమాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించిన నరేష్ గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘మహర్షి’ లో చేసిన రవి క్యారెక్టర్ మంచి పేరు తెచ్చి పెట్టింది. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ నరేష్ సీరియస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు.

విజయ్ కనకమేడలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్‌.వి. 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘నాంది’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సోమ‌వారం ఈ సినిమా రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఇది నరేష్ నటిస్తున్న 57వ సినిమా..

Image

నరేష్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ నివ్వగా, నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సినిమా టైటిల్ లుక్‌తో పాటు న‌రేశ్ లుక్‌ను కూడా విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

Read Also : ముంబైలో ప్రారంభమైన ‘ఫైటర్’

Image

నరేష్ లుక్‌ చూసి ప్రేక్ష‌కులు షాక‌య్యారు. నగ్నంగా తలకిందులుగా వేలాడుతూ ఉన్న నరేష్ లుక్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఎడిటింగ్ : చోటా కె ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి.