హిందీలో హిట్టయ్యింది!

సుందర్ సూర్య దర్శకత్వంలో నాగశౌర్య, షాలిని జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'అమ్మమ్మగారిల్లు' హిందీ వెర్షన్ 'నాని మా' బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది..

  • Published By: sekhar ,Published On : September 20, 2019 / 07:44 AM IST
హిందీలో హిట్టయ్యింది!

సుందర్ సూర్య దర్శకత్వంలో నాగశౌర్య, షాలిని జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అమ్మమ్మగారిల్లు’ హిందీ వెర్షన్ ‘నాని మా’ బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది..

మన తెలుగు సినిమాలకు నార్త్‌లో రోజురోజుకీ ఆదరణ పెరుగుతుంది. ఇప్పటికే తెలుగులో సూపర్ హిట్ అయిన పలు సినిమాలను హిందీలో రీమేక్ చెయ్యగా అక్కడకూడా బాగా ఆడాయి. ఇక ‘బాహుబలి’ అయితే బాలీవుడ్‌లో భారీ వసూళ్లు రాబట్టి హిందీ చిత్ర పరిశ్రమ సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక మన తెలుగు సినిమాలు డిజిటల్ రైట్స్ పరంగానూ సత్తా చాటుతున్నాయి. తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి వివిధ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తున్నారు.

‘రేసుగుర్రం’, ‘సరైనోడు’ వంటి తెలుగు సినిమాల హిందీ వెర్షన్‌కు భారీగా వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నాగశౌర్య, షాలిని జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అమ్మమ్మగారిల్లు’ సినిమా హిందీ వెర్షన్ ‘నాని మా’ బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సుందర్ సూర్య ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీతోనే డైరెక్టర్‌‌గా మంచి మార్కులు పడ్డాయి అతనికి.. సుమిత్రా రావు, రావు రమేష్ తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేసిన ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాకి తెలుగులో మంచి టాక్ వచ్చినా.. చిన్న సినిమాలకు ఉండే థియేటర్స్ వంటి ప్రాబ్లమ్స్ వల్ల అనుకున్నంతగా ఆడియన్స్‌కు చేరువ కాలేదు.

కానీ, హిందీ వెర్షన్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చెయ్యగా.. భారీగా వ్యూస్ వచ్చాయి.. ఇప్పటికి 31 మిలియన్స్‌కు పైగా వ్యూస్ రావడం విశేషం.. 215K పైగా లైక్స్ కూడా వచ్చాయి. ఇంటిల్లిపాదీ కలిసి చూసే చక్కటి ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ‘అమ్మమ్మగారిల్లు’ హిందీ వెర్షన్ ‘నాని మా’ బాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది.

రోటీన్ రొట్టకొట్టుడు సినిమాలు, లవ్ స్టోరీలు వంటి రొటీన్ ఫార్మాట్‌లో కాకుండా.. కనుమరుగవుతున్న మానవ సంబంధాలను తెరపై చూపించి మైమరపించిన దర్శకుడు సుందర్ సూర్య అభిరుచిని మెచ్చుకోక తప్పదు. మంచి సినిమా తీయడం దర్శకుడి కర్తవ్యం అయితే అలాంటి మంచి సినిమాలను ఆదరించడం ప్రేక్షకుల బాధ్యత అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ‘అమ్మమ్మగారిల్లు’ లాంటి మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది..