RRR : కాలభైరవ పై ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్.. సారీ చెప్పిన కాలభైరవ!

ఆస్కార్ వేదిక పై నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కాలభైరవ.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ వేశాడు. ఆ పోస్ట్ చుసిన ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో కాలభైరవ సారీ చెబుతూ పోస్ట్ పెట్టాడు.

RRR : కాలభైరవ పై ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్.. సారీ చెప్పిన కాలభైరవ!

naatu naatu singer kala bhairava said sorry to ntr and ram charan fans

RRR : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీ‌స్టార్రర్ చిత్రం RRR. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి అందించిన ‘నాటు నాటు’ సాంగ్ ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. ఈ పాటని కీరవాణి తనయుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కర్ని ఉర్రూతలూగించిన ఈ పాట ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుని అందుకొని చరిత్ర సృష్టించింది. కేవలం అవార్డు అందుకోవడమే కాదు, ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు పర్ఫార్మెన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

RRR : ఆస్కార్‌తో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన RRR టీం.. జై హింద్ అంటూ రాజమౌళి..

కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఇచ్చిన ఈ లైవ్ పర్ఫార్మెన్స్ కి వేడుకల్లో ఉన్న వారంతా నిలబడి చప్పట్లు కొట్టి గౌరవించారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన వేదిక పై పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా, వేదికలో ఉన్న ఇంటర్నేషనల్ స్టార్స్ నుంచి స్టాండింగ్ ఒవేషన్ రావడంతో.. సింగర్ కాలభైరవ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ వేశాడు. ఈ పోస్ట్ లో ఆస్కార్ అవార్డు రావడానికి కారణం అంటూ రాజమౌళి, కీరవాణి మరియు ఫ్యామిలీ మెంబెర్స్ గురించి మాత్రమే చెప్పుకొచ్చాడు. దీంతో ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

అయితే దీని పై కాలభైరవ వెంటనే రియాక్ట్ అయ్యాడు. ”సందేహం లేదు ఎన్టీఆర్ అండ్ చరణ్ అన్నలు కూడా ఆస్కార్ రావడానికి కారణం. ఆ పోస్ట్ లో.. అకాడమీ స్టేజ్ పై పెర్ఫార్మెన్స్‌ అవకాశం రావడానికి నాకు ఎవరు సహకరించారు అనే దాని గురించి మాట్లాడుతూ నేను అలా మాట్లాడాను. అయితే అది తప్పుగా అర్ధమయ్యి, మిమ్మల్ని బాధించింది. అందుకు నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను” అంటూ మరో పోస్ట్ పెట్టాడు. కాగా ఈరోజు తెల్లవారుజాము 3 గంటలకు రాజమౌళి, కీరవాణి, కాలభైరవ ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్నారు. వారికీ అభిమానులు ఘన స్వగతం పలికారు.