Naatu Naatu : నాటు నాటు మరిన్ని రికార్డులు.. ఆస్కార్ తర్వాత నాటు నాటు గూగుల్ సెర్చ్ ఏ రేంజ్ లో పెరిగిందో తెలుసా??

ఆస్కార్ వచ్చిన తర్వాత నాటు నాటుకి మరింత ఆదరణ పెరిగింది. అంతకుముందే నాటు నాటు సాంగ్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ప్రపంచ దేశాల్లో వైరల్ అయింది. ఇప్పుడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వచ్చిన తర్వాత నాటు నాటు గురించి................

Naatu Naatu : నాటు నాటు మరిన్ని రికార్డులు.. ఆస్కార్ తర్వాత నాటు నాటు గూగుల్ సెర్చ్ ఏ రేంజ్ లో పెరిగిందో తెలుసా??

Naatu Naatu song gets high search record in google after oscar

Naatu Naatu :  RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ సినీ అత్యున్నత అవార్డు ఆస్కార్ సాధించిన సంగతి తెలిసిందే. రాజమౌళి తన టీంతో కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. సంవత్సర కాలంగా RRR సినిమాని రాజమౌళి ముందుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలుగా ప్రమోట్ చేశాడు. ఇక నాటు నాటు సాంగ్ అయితే అన్ని దేశాల ప్రేక్షకులని ఊపేసి వారితో కూడా నాటు నాటు అంటూ స్టెప్పులు వేయించింది.

ఆస్కార్ వచ్చిన తర్వాత నాటు నాటుకి మరింత ఆదరణ పెరిగింది. అంతకుముందే నాటు నాటు సాంగ్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ప్రపంచ దేశాల్లో వైరల్ అయింది. ఇప్పుడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వచ్చిన తర్వాత నాటు నాటు గురించి మరింతమంది సెర్చ్ చేస్తున్నారు. ఆస్కార్ తర్వాత దేశ విదేశాల్లో ఈ సాంగ్ వినేవాళ్ళ సంఖ్య బాగా పెరిగిందట. తాజాగా జపాన్ కి చెందిన ఓ డేటా అనలిస్ట్ సంస్థ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం ఆస్కార్ వచ్చిన తర్వాత అంతకుముందు కంటే కూడా 10 రేట్లు ఎక్కువగా దీని గురించి సెర్చ్ చేస్తున్నారట. ఆస్కార్ వచ్చిన ఈ మూడు రోజుల్లోనే నాటు నాటు సాంగ్ ని ఏకంగా 1105 శాతం మంది వివిధ దేశాల నుంచి గూగుల్ లో వెతికారట.

Raviteja : వెంకటేష్ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేసిన మాస్ మహారాజ..

అలాగే టిక్ టాక్ లో కూడా ఆస్కారం వచ్చిన తర్వాత ఏకంగా 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి నాటు నాటు సాంగ్ కి. మన దేశంలో టిక్ టాక్ ని బ్యాన్ చేసినా వేరే దేశాల్లో ఇంకా ఉంది టిక్ టాక్. RRR సినిమా వచ్చి సంవత్సరం అయినా, ఆస్కార్ వచ్చేసినా ఇంకా నాటు నాటు ప్రపంచాన్ని ఊపేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది.