రామ్‌తో కిరాక్ హైదరాబాద్ పోరీ

నన్ను దోచుకుందువటే మూవీతో ఆడియన్స్ మనసులు దోచుకున్న నభా నటేష్, రామ్‌తో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అయిపోయింది.

  • Published By: sekhar ,Published On : January 31, 2019 / 10:14 AM IST
రామ్‌తో కిరాక్ హైదరాబాద్ పోరీ

నన్ను దోచుకుందువటే మూవీతో ఆడియన్స్ మనసులు దోచుకున్న నభా నటేష్, రామ్‌తో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అయిపోయింది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌‌ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్, ఇస్మార్ట్ శంకర్.. డబుల్ దిమాఖ్ హైదరాబాదీ.. రామ్ గెటప్, ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. పూరీ భార్య లావణ్య సమర్పణలో, పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై, చార్మీతో కలిసి, ఓన్ డైరెక్షన్‌లో పూరి, ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్, ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తాడట. సవ్యసాచి, మజ్ను సినిమాలతో ఆకట్టుకున్న నిధి అగర్వాల్‌ని ఒక హీరోయిన్‌గా సెలెక్ట్ చేసిన మూవీ యూనిట్, రీసెంట్‌గా సెకండ్ హీరోయిన్‌ని కూడా ఫిక్స్ చేసింది. నన్ను దోచుకుందువటే మూవీతో ఆడియన్స్ మనసులు దోచుకున్న నభా నటేష్, రామ్‌తో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అయిపోయింది.

ఇస్మార్ట్ శంకర్, పక్కా హైదరాబాదీ స్టైల్‌లో, హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటాడు కాబట్టి, నభా క్యారెక్టర్ కూడా పక్కా హైదరాబాదీ అమ్మాయిలా ఉంటుందట. కరెక్ట్‌గా చెప్పాలంటే, కిరాక్ పోరీ అన్నమాట.. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఇస్మార్ట్ శంకర్.. మే లో రిలీజ్ కానుంది. 

వాచ్ టైటిల్ మోషన్  పోస్టర్‌…