Project K: హెల్ప్ ప్లీజ్ అంటూ హైప్ పెంచిన అశ్విన్.. అసలేంటి ప్రాజెక్ట్ కె?

ప్రమోషన్స్ తో రాధేశ్యామ్ పై ప్రభాస్ అంచనాలు పెంచేస్తుంటే.. ప్రాజెక్ట్ కె పై ఎక్స్ పెక్టేషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. గ్లోబల్ స్టార్ తో పాటూ అమితాబ్,

Project K: హెల్ప్ ప్లీజ్ అంటూ హైప్ పెంచిన అశ్విన్.. అసలేంటి ప్రాజెక్ట్ కె?

Project K

Project K: ప్రమోషన్స్ తో రాధేశ్యామ్ పై ప్రభాస్ అంచనాలు పెంచేస్తుంటే.. ప్రాజెక్ట్ కె పై ఎక్స్ పెక్టేషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. గ్లోబల్ స్టార్ తో పాటూ అమితాబ్, దీపికా వంటి ఇండియన్ స్టార్స్ ను కలుపుకుని భారీ సైన్స్ ఫిక్షన్ అన్నప్పుడే.. విపరీతమైన బజ్ క్రియేటయింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేసి హెడ్ లైన్స్ లో నిలిచాడు నాగ్ అశ్విన్.

Project K : ప్రభాస్ సినిమా కోసం రంగంలోకి ఆనంద్ మహేంద్ర.. నాగ్ అశ్విన్ ట్వీట్‌కి రిప్లై..

మహీంద్ర గ్రూప్ ఛైర్మన్.. ఆనంద్ మహీంద్రాకు క్రేజీ ట్వీట్ చేశాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె చేస్తోన్న ఈ డైరెక్టర్.. ఆ మూవీ కోసం ఓ హెల్ప్ కావాలంటూ ఆనంద్ మహీంద్రాను రిక్వెస్ట్ చేశాడు. దానికి మహీంద్రా నుండి కూడా అంతే స్పీడ్ తో రెస్పాన్స్ వచ్చింది. అమితాబ్, ప్రభాస్, దీపికా పదుకొనేలతో ఇండియన్ సైన్స్ ఫిక్షన్ తెరకెక్కిస్తున్నామని… ఈ ప్రాజెక్ట్ కోసం దేశం గర్వించేలా నెవర్ బిఫోర్ టెక్నాలజీతో యునీక్ వెహికిల్స్ ను తయారుచేస్తున్నామని ట్వీట్ చేసి ప్రాజెక్ట్ కె పై భారీగా అంచనాలు పెంచేసాడు నాగ్ అశ్విన్.

Project K: ప్రభాస్ సినిమా కోసం ఆనంద్ మహీంద్రా సాయం!

గతంలో ఎవ్వరూ చేయని.. ఎవ్వరూ ఊహించని సబ్జెక్ట్ తో ప్రాజెక్ట్ కేను తెరకెక్కిస్తున్నామన్నాడు నాగ్ అశ్విన్. ఆనంద్ మహీంద్రాను పొగుడుతూ బిగ్ స్కేల్ ప్లాన్ చేసిన ఈ మూవీ కోసం పనిచేస్తున్న డిజైనర్స్, ఇంజనీర్స్ కు మీ తరపున సహాయం కావాలంటూ ట్వీట్ చేశాడు. ఇలా పోస్ట్ పెట్టి ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊపునిచ్చారు డైరెక్టర్. దీనిని బట్టి ప్రభాస్ ప్రాజెక్ట్ కె అంచనాలకు అందని రీతిలో తయారవుతుందని ట్రెండ్ చేస్తున్నారు.

Project K : ప్రభాస్‌తో పని చేయడం నాకు గౌరవం.. ప్రభాస్‌పై అమితాబ్ ట్వీట్..

టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో హిమాలయాల్లో సాగే సైన్స్ ఫిక్షన్ గా ప్రాజెక్ట్ కేను డిజైన్ చేస్తున్నారు. ఈ 5వందల కోట్ల భారీ బడ్జెట్ మూవీలో ఇదివరకు చూడని క్యారెక్టర్స్ లో ప్రభాస్, దీపికా, అమితాబ్ కనిపించబోతున్నారు. ఓ వైపు గ్యాప్ లేకుండా షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఆమధ్య దీపికాతో సీన్స్ చేసిన గ్లోబల్ స్టార్.. ఈమధ్యే అమితాబ్ తో కాంబినేషన్స్ సీన్స్ కానిచ్చారు. అసలై ప్రాజెక్ట్ హైప్ మీద ఉందంటే.. ఇప్పుడిలా ఎవరూ అటెంప్ట్ చేయని సినిమా అంటూ బజ్ ని డబుల్ చేశాడు క్రేజీ డైరెక్టర్.