బిగ్ బాస్‌ ఇంట్లో ఇచ్చిన మాట: అలీ రెజాకి నాగార్జున గిఫ్ట్

  • Published By: vamsi ,Published On : December 17, 2019 / 07:17 AM IST
బిగ్ బాస్‌ ఇంట్లో ఇచ్చిన మాట:  అలీ రెజాకి నాగార్జున గిఫ్ట్

బిగ్ బాస్ సీజన్ 3.. నాగార్జున హోస్ట్‌గా సాగిన ఈ షోలో ఎన్నో ఎమోషన్స్.. ఎన్నో అనుబంధాలు.. మరెన్నో భావోద్వేగాలు.. బిగ్‌బాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న కంటెస్టెంట్ మాత్రం అలీ రెజా. బుల్లి తెర సీరియల్స్‌తో ఇంటిల్లి పాదిని అలరించిన అలీ అడపాదడపా సినిమాలు కూడా చేస్తుంటాడు. ధృవ సినిమాలో రామ్ చరణ్ పక్కన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. బుల్లితెర సీరియల్ మాటే మంత్రం ద్వారా ఫీమేల్ ఆడియన్స్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడు. తన కోపంతో బుల్లితెర అర్జున్ రెడ్డి అంటూ ముద్ర వేయించుకున్నాడు కూడా.

టాస్క్‌ల వరకు పర్‌ఫెక్ట్‌గా ఆడుతూ క్రేజ్ తెచ్చుకున్న అలీ, అందరూ ఊహించినట్టుగానే చివరకు టాప్ 5లో నిలిచాడు. బిగ్‌బాస్ హౌస్‌లో శివజ్యోతి, రవికృష్ణ, వితికా, రాహుల్, వరుణ్ సందేశ్, పునర్నవిలతో మంచి బాండింగ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు హోస్ట్ నాగార్జున ఎక్కువ సార్లు కోప్పడింది ఎవరైనా ఉన్నారు అంటే అతను అలీ రెజా మాత్రమే అటువంటి అలీ రెజాకు లేటెస్ట్‌గా అనుకోని గిఫ్ట్ ఇచ్చాడు నాగార్జున.

లేటెస్ట్‌గా అలీ రెజాకి తను వాడే బ్రాండెడ్ షూస్‌ని కొని పెట్టాడు నాగార్జున. అనుకోని సమయంలో సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు నాగార్జున. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం లేటెస్ట్‌గా బ్రాండెడ్ షూస్ కొనిరపెట్టాడు. ఈ విషయాన్ని అలీ రెజా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. నాగ్ సర్ నాకు ఇష్టమైన బ్రాండ్ బూట్ల జతని బహుమతిగా ఇచ్చారు. నేను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఈ బూట్ల కోసం నేను ఆయనని అడిగాను అప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నాకు గిఫ్ట్‌గా బూట్లను కొనిపెట్టారు. ఇవి నాకు ఎంతో విలువైనవి అని అన్నారు అలీ రెజా.