Love Story : నా నటన బాగుంది అంటే సగం క్రెడిట్ వాళ్లకే వెళ్లాలి..

‘లవ్ స్టోరీ’ సినిమాలో తన నటన బాగుంది అనే పేరు వస్తే అందులో కచ్చితంగా సగం క్రెడిట్ వారి ముగ్గురికే చెందుతుంది అన్నారు యువసామ్రాట్ నాగ చైతన్య..

10TV Telugu News

Love Story: అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరీ’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. సంస్థలు నిర్మించాయి.. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ద్వారానే సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు.

Love Story Trailer : ‘చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం’.. చైతు బెస్ట్ పెర్ఫార్మెన్స్..

చైతు, సాయి పల్లవిల కెమిస్ట్రీ, ఇద్దరూ పోటాపోటీగా చేసిన డ్యాన్స్ మూమెంట్స్, తెలంగాణ యాసలో చైతు డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 24 సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టీం ప్రమోషన్స్ స్పీడప్ చేశారు.

Bigg Boss 5 Telugu : ‘లవ్ స్టోరీ’ కోసం చైతు – సాయి పల్లవి..

ఈ సందర్భంగా చైతు.. ‘‘లవ్ స్టోరీ’ సినిమాలో నా నటన బాగుంది అనే పేరు వస్తే అందులో కచ్చితంగా సగం క్రెడిట్ సాయి పల్లవి, ఈశ్వరీ రావు గారు అలాగే శేఖర్ కమ్ముల గారికి ఇవ్వాలి.. ‘లవ్ స్టోరీ’ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటాయి. తప్పకుండా సినిమా మిమ్మల్నందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు.

Prema Nagar : తాత సినిమాతో మనవడి మూవీకి లింక్ భలే కుదిరిందే..