Custody Movie Song : చైతూ, కృతి.. ఒక్క పాట కోసం ఏడు భారీ సెట్స్..

నాగ చైతన్య 22వ సినిమా 'కస్టడీ' సినిమా తెరకెక్కుతుంది. కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో నాగ చైతన్య పోలీస్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది................

Custody Movie Song : చైతూ, కృతి.. ఒక్క పాట కోసం ఏడు భారీ సెట్స్..

Naga Chaitanya and krithi Shetty Custody Movie one Song shoot in 7 sets

Custody Movie Song :  నాగచైతన్య లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్స్ కొట్టి ఆ తర్వాత థ్యాంక్‌‌యూ సినిమాతో పరాజయం చూశాడు. జస్ట్ లో హ్యాట్రిక్ మిస్ అయింది. ప్రస్తుతం నాగ చైతన్య 22వ సినిమా ‘కస్టడీ’ సినిమా తెరకెక్కుతుంది. కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో నాగ చైతన్య పోలీస్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

తాజాగా ఈ సినిమాలో నాగచైతన్య, కృతి శెట్టి పై ఒక పాటని షూట్ చేస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అయితే ఈ పాటని భారీగా షూట్ చేస్తున్నారు. ఒక్క పాట కోసం ఏకంగా 7 సెట్స్ వేసి షూట్ చేస్తున్నారట. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సెట్స్ వేసి సాంగ్ షూట్ చేస్తున్నారు. తాజాగా ఈ సెట్ నుంచి చిత్ర యూనిట్ ఫోటో రిలీజ్ చేశారు. ఇందులో చైతూ, కృతి డ్యాన్స్ కాస్ట్యూమ్ లో మెరిసిపోతున్నారు.

CM KCR Cricket Trophy Launch : సీఎం KCR క్రికెట్ ట్రోఫీని లాంచ్ చేసిన నాని, అంబటి రాయుడు, హరీష్ రావు గ్యాలరీ..

గతంలో బంగార్రాజు సినిమాలో చైతూ, కృతి కలిసి నటించి హిట్ కొట్టారు. ఆ సినిమాలో ఇద్దరి కాంబినేషన్ లో ఓ మాస్ బీట్ సాంగ్ కూడా ఉంది. ఆ పాట బాగా హిట్ అయింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఒక్క సాంగ్ కోసమే 7 సెట్స్ వేయడంతో ఈ సినిమాలో కూడా సాంగ్స్, డ్యాన్సులు సూపర్ గా ఉంటాయని భావిస్తున్నారు. కృతి కూడా వరుస హిట్స్ తర్వాత ఒకేసారి మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడటంతో ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది. ఆల్రెడీ చైతూ, కృతి కలిసి బంగార్రాజులో మ్యాజిక్ చేశారు, మరి ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేసి హిట్ కొడతారేమో చూడాలి.