Naga Chaitanya – Sobhita : నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ డేటింగ్ నిజమేనా?.. నెల క్రితమే బయటపెట్టిన చెఫ్.. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో..

కొన్ని నెలల క్రితం నాగ చైతన్య మాత్రం నటి శోభితతో డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ వినిపించాయి. వీరిద్దరూ కలిసిన ఫొటో కూడా బయటకు రాలేదు, కలిసి ప్రాజెక్టు కూడా చేయలేదు కానీ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.....................

Naga Chaitanya – Sobhita : నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ డేటింగ్ నిజమేనా?.. నెల క్రితమే బయటపెట్టిన చెఫ్.. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో..

Naga Chaitanya and Sobhita dating rumors goes viral again with a photo proof

Naga Chaitanya – Sobhita :  నాగ చైతన్య(Naga Chaitanya), సమంత(Samantha) విడిపోయిన తర్వాత వారి రిలేషన్ పై అనేక వార్తలు, రూమర్స్ వచ్చాయి. వీటిపై కొన్ని రోజులు ఇద్దరూ కూడా స్పందించలేదు. కానీ సమంత మీద నెగిటివ్ వార్తలు ఎక్కువ రావడంతో సమంత ఈ వార్తలపై పలుమార్లు సీరియస్ అయింది. సమంతకి సంబంధించిన వాళ్ళు కూడా చైతు సమంత విడాకుల(Divorce) వార్తలపై సీరియస్ అయ్యారు. విడిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటూ బిజీ అయ్యారు.

సమంత వరుసగా సినిమాలు చేస్తుంది. మధ్యలో మాయోసైటిస్ వ్యాధి రావడంతో కొన్ని రోజులు చికిత్స తీసుకొని ఇటీవలే కంబ్యాక్ ఇచ్చింది. ఇక నాగ చైతన్య కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే కొన్ని నెలల క్రితం నాగ చైతన్య మాత్రం నటి శోభితతో డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ వినిపించాయి. వీరిద్దరూ కలిసిన ఫొటో కూడా బయటకు రాలేదు, కలిసి ప్రాజెక్టు కూడా చేయలేదు కానీ వీరిద్దరూ ప్రేమ,డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై చైతు స్పందించకపోయినా శోభిత మాత్రం ఇండైరెక్ట్ గా ఇవన్నీ ఫేక్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది.

కానీ తాజాగా నేడు ఓ ఫొటో వైరల్ గా మారింది. నాగ చైతన్య కొన్ని రోజుల క్రితం హోటల్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ చెఫ్ నాగ చైతన్యతో కలిసి ఫొటో దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఆ ఫొటోలో వెనకాల శోభిత ధూళిపాళ కూర్చొని ఉంది. ఈ ఫొటో పెట్టి నెల రోజుల పైనే అవుతున్నా సడెన్ గా ఇప్పుడు వైరల్ గా మారింది. మొదట్లో ఈ ఫోటోని అంతగా గమనించకపోవడంతో ఇందులో శోభిత కనపడలేదు అనుకుంట. కానీ నెటిజన్లు కొంతమంది ఈ ఫోటోని ఇప్పుడు షేర్ చేసి ఇందులో శోభిత ఉంది, చైతు శోభిత కలిసి ఎక్కడికో వెళ్లారు, ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని పోస్టులు చేస్తున్నారు. దీంతో మరోసారి నాగ చైతన్య, శోభిత వైరల్ గా మారారు. ఇక ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Upasana : చరణ్ బర్త్‌డే పార్టీలో ఉపాసన.. వైరల్ అవుతున్న ఉపాసన బేబీ బంప్ ఫొటోలు, వీడియోలు..

గతంలో ఎలాంటి రూమర్స్ వచ్చినా నాగ చైతన్య స్పందించలేదు. అయితే ఈ ఫొటోతో చైతు, శోభిత ఇద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందా అని వైరల్ అయింది. మరి దీనిపై అయినా చైతు స్పందిస్తాడో లేదో చూడాలి. శోభిత ఏమైనా స్పందిస్తుందా లేక నిజంగానే వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా తెలియాలి.