Naga Chaitanya: మహేష్ అభిమానిగా అక్కినేని హీరో..!

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ధ్యాంక్యూ’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన....

Naga Chaitanya: మహేష్ అభిమానిగా అక్కినేని హీరో..!

Naga Chaitanya As Mahesh Babu Fan In Thank You

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ధ్యాంక్యూ’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నడు ఈ హీరో. ఇక ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ఫీల్ గుడ్ మూవీగా దర్శకుడు విక్రమ్ తెరకెక్కించగా, ఈ సినిమాలో చైతూ మూడు విభిన్నమైన లుక్స్‌లో మనకు కనిపిస్తాడు.

Thank You: ధ్యాంక్యూ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

ఈ సినిమాలో హీరో పాత్రకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నాగచైతన్య తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు వీరాభిమానిగా కనిపిస్తాడట. చైతూ స్కూల్ డేస్‌లో మహేష్ అంటే పడిచచ్చిపోయేంత అభిమానిగా మనకు దర్శకుడు ఈ సినిమాలో చూపించబోతున్నాడట. మరి మహేష్ అభిమానిగా చైతూ కనిపిస్తుండటంతో, మహేష్ డైలాగులు, మేనరిజం ఏదైనా కాపీ చేస్తాడా లేదా అనేది ఈ సినిమా చూశాకే తెలుస్తోంది.

Naga Chaitanya : ఆ హీరోయిన్ గురించి మొత్తం తెలుసు అంటున్న నాగచైతన్య..

ఈ చిత్రంలో చైతూ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండనుండగా, ఆయన సరసన ముగ్గురు భామలు నటిస్తున్నారు. రాశిఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.