Naga Chaitanya: సమ్మర్‌లో ‘కస్టడీ’లో వేస్తానంటోన్న అక్కినేని హీరో!
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాలో పోలీస్ పాత్రలో చైతూ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది.

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాలో పోలీస్ పాత్రలో చైతూ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కస్టడీ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే కస్టడీ మూవీని ప్రపంచవ్యాప్తంగా మే 12న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాలో చైతూ పోలీస్ పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Naga Chaitanya : ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో నాగచైతన్య కొత్త మూవీ..
ఇక ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా.. ‘బంగార్రాజు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత ఈ జంట మరోసారి ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ సినిమాలో ప్రియమణి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో చైతూ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియాలంటే మే 12 వరకు వెయిట్ చేయాల్సిందే.
It’s ?#Custody in theatres on May 12, 2023 ?#CustodyOnMay12?
A @vp_offl Hunt ?@chay_akkineni @IamKrithiShetty @thearvindswami@SS_Screens @srinivasaaoffl @realsarathkumar #Priyamani @Premgiamaren @VennelaKishore @srkathiir @rajeevan69 @abburiravi @TimesMusicSouth #VP11 pic.twitter.com/kOCKUlyRiB
— venkat prabhu (@vp_offl) December 28, 2022