Custody : నాగచైతన్య కస్టడీ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎందులో? ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ తెలుసా?
కస్టడీ సినిమా బాగున్నప్పటికీ, విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఇక కస్టడీ సినిమా ఓటీటీ బాట పట్టనుంది.

Naga Chaitanya Custody Movie Streaming soon in Amazon Prime OTT
Custody Movie : నాగచైతన్య(Naga Chaitanya), కృతిశెట్టి(Krithi Shetty) జంటగా వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ(Custody) సినిమా ఇటీవల మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై ముందు నుంచి అంచనాలు నెలకొన్నాయి. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ భారీగానే చేశారు. తెలుగు, తమిళ్ లో ఈ సినిమా రిలీజయింది.
అయితే కస్టడీ సినిమా బాగున్నప్పటికీ, విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. కొంతమంది కావాలని ఈ సినిమా మీద నెగిటివ్ రివ్యూలు ఇచ్చారని టాక్ కూడా వచ్చింది. కానీ కస్టడీ సినిమా చాలా మందికి నచ్చింది. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సర్ ప్రైజెస్ ఉండటంతో చాలా మందికి ఈ సినిమా నచ్చింది.
NBK 108 : 108 హోర్డింగ్స్ తో బాలయ్య 108 సినిమా టైటిల్ అనౌన్స్.. బాలయ్య బర్త్ డే ముందే సూపర్ ప్లాన్..
ఇక కస్టడీ సినిమా ఓటీటీ బాట పట్టనుంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో కస్టడీ సినిమా రానుంది. జూన్ 9 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమైంది. అమెజాన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. తెలుగు, తమిళ్ లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. థియేటర్స్ లో కస్టడీ సినిమా మిస్ అయిన వాళ్ళు జూన్ 9 నుంచి అమెజాన్ లో చూసేయండి. కస్టడీ తర్వాత నాగ చైతన్య అయితే ఇంకే సినిమాను ప్రకటించలేదు. డైరెక్టర్ వెంకట్ ప్రభు ఏకంగా తమిళ్ స్టార్ హీరో విజయ్ తో సినిమాను ప్రకటించాడు. కృతి శెట్టి చేతిలో తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలు ఉన్నాయి .
embark on a heart-pounding journey with constable Siva as he works his way through a web of corruption, betrayal, and lies! 👮♂#CustodyOnPrime, June 9 pic.twitter.com/oosDXGXjE8
— prime video IN (@PrimeVideoIN) June 7, 2023