Naga Chaitanya : హిందీ హారర్ మూవీ రీమేక్‌లో అక్కినేని హీరో.. క్లారిటీ ఇచ్చిన చైతన్య టీం!

నాగచైతన్య బాలీవుడ్ హారర్ బ్లాక్ బస్టర్ మూవీ 'భూల్‌ భులయ్యా 2' ని రీమేక్ చేయబోతున్నాడా? ఈ విషయం పై చైతన్య ఎటువంటి క్లారిటీ ఇచ్చింది? ఇక్కడ చూడండి.

Naga Chaitanya : హిందీ హారర్ మూవీ రీమేక్‌లో అక్కినేని హీరో.. క్లారిటీ ఇచ్చిన చైతన్య టీం!

Naga Chaitanya doing Bhool Bhulaiyaa 2 remake in telugu and tamil is true

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ఇటీవల కస్టడీ (Custody) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమా బై లింగువల్ గా తెరకెక్కింది. ఈ మూవీతోనే చైతన్య తమిళ్ డెబ్యూట్ కూడా ఇచ్చాడు. అయితే ఈ సినిమా థియేటర్స్ వద్ద పరవాలేదు అనిపించింది అంతే. కాగా ఈ అక్కినేని హీరో ఇప్పుడు ఒక హిందీ హారర్ మూవీ రీమేక్ చేతియబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది బాలీవుడ్ లో రిలీజ్ అయిన ‘భూల్‌ భులయ్యా 2’ (Bhool Bhulaiyaa 2) బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

Adipurush : ఆదిపురుష్ మూవీతో బాలీవుడ్‌కి భయం పుడుతుందా.. ఎందుకో తెలుసా?

కార్తీక్‌ ఆర్యన్‌, కియారా అద్వానీ (Kiara Advani) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కీలకపాత్రలో కనిపించింది. ఈ సినిమాని చైతన్య తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నాడని, టబు పాత్రని తెలుగు, తమిళ ఆడియన్స్ కి పరిచయం ఉన్న జ్యోతిక (Jyotika) నటించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలు పై చైతన్య టీం క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, నాగచైతన్య కొత్త సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెప్పుకొచ్చారు.

Sharwanand – Siddharth : శర్వానంద్ పెళ్లిలో సిద్దార్థ్ మ్యూజికల్ కాన్సర్ట్.. వీడియో వైరల్!

దీంతో భూల్‌ భులయ్యా 2 రీమేక్ వార్తలకి చెక్ పడింది. కాగా చైతన్య తన తదుపరి ప్రాజెక్ట్ ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని చందు ముండేటి డైరెక్ట్ చేయబోతున్నాడు. గుజరాత్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా ఉండబోతుందని, చైతన్య పడవ నడుపుకునే పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది.