Naga Chaitanya: సక్సెస్ ఫార్ములా పట్టుకున్న చైతూ.. ట్రాక్ ఎక్కినట్లే!

ఇండస్ట్రీలో సక్సెస్ ఫార్ములాను పట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు నాగచైతన్య. హీరోయిజం, స్టార్డమ్, పాన్ ఇండియా ఇలాంటి వాటి జోలికి పోకుండా లవ్ స్టోరీస్ తోనే సక్సెస్ కొడుతున్నాడు నాగచైతన్య.

Naga Chaitanya: సక్సెస్ ఫార్ములా పట్టుకున్న చైతూ.. ట్రాక్ ఎక్కినట్లే!

Naga Chaitanya

Naga Chaitanya: ఇండస్ట్రీలో సక్సెస్ ఫార్ములాను పట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు నాగచైతన్య. హీరోయిజం, స్టార్డమ్, పాన్ ఇండియా ఇలాంటి వాటి జోలికి పోకుండా లవ్ స్టోరీస్ తోనే సక్సెస్ కొడుతున్నాడు నాగచైతన్య. ఫామిలీ పరంగా కాస్త డిస్టర్బ్ అయినా కూడా కెరీర్ పరంగా సక్సెస్ ట్రాక్ లో దూసుకెళ్తున్నాడు.

Shivshakti Sachdev: సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న ఢిల్లీ భామ!

నాగచైతన్య లేటెస్ట్ మూవీ థాంక్యూ షూటింగ్ యూరప్ లో ఫినిష్ అయ్యింది. ఈ సినిమాలో నాగచైతన్య త్రి షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడని సమాచారం. మనం సినిమాతో మెమరబుల్ సక్సెస్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. జోష్ తో తన సినిమా ప్రయాణాన్ని మొదలు పెట్టించిన దిల్ రాజు థాంక్యూ సినిమా నిర్మిస్తున్నారు.

Allu Arjun: ప్రమోషన్స్ వివాదం.. బన్నీకి బ్రాండే బ్యాడా?

లక్కీగా థాంక్యూ కథ కూడా తన సక్సెస్ ప్రయాణంలో సహాయపడిన వాళ్లకి తిరిగి థాంక్యూ చెప్పుకునే కథ. తన రియల్ లైఫ్ కి సూట్ అయ్యే విధంగా ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. సో చైతూ సినిమా ఓపెనింగ్ రోజే ట్విట్టర్ లో విక్రమ్ కె కుమార్ కు, దిల్ రాజుకు థాంక్యూ చెప్పాడు. ఫీల్ గుడ్ స్టోరీ ఇచ్చి తన ఆడియన్స్ కు థాంక్యూ చెప్పడానికి రెడీ అవుతున్నాడు.

Malavika Mohanan: ఒంపు సొంపులతో ముచ్చెమటలు పట్టించే మాళవిక!

మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ సినిమాలతో యువసామ్రాట్ నాగచైతన్య సక్సెస్ ట్రాక్ లో దూసుకపోతుండగానే సంక్రాంతి సీజన్ లో సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ వచ్చి నాగచైతన్య ఫాన్స్ కు సంక్రాంతి జోష్ నిస్తే, బంగార్రాజు ఇచ్చిన సక్సెస్ మూడ్ లో ఉన్న నాగచైతన్య కు మరింత సక్సెస్ కిక్ ఇవ్వడానికి థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

Chiranjeevi : చిరంజీవికి కరోనా నెగెటివ్.. వర్క్ మోడ్‌లో మెగాస్టార్!

మనం తర్వాత విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కాబట్టి చైతన్యకు, చైతూ ఫాన్స్ కు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత వీళ్ల కాంబినేషన్ లో ఓ హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా రానుంది. నందిని రెడ్డి డైరెక్షన్లో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. సో ఈ ఇయర్ కూడా నాగచైతన్య కెరీర్ పీక్స్ లోనే ఉంటుందని లెక్కలేసుకుంటున్నారు అక్కినేని ఫాన్స్.