Naga Chaitanya: సామ్ బాటలో చైతూ.. ఓటీటీ సినిమాకు ఒకే!

అక్కినేని వారి కోడలు సమంతా ఇప్పటికే ఇటు బుల్లితెర మీద హోస్ట్ గానే కాకుండా.. ఓటీటీ సినిమాల మీద కూడా స్పెషల్ దృష్టి పెట్టి దూసుకెళ్తుంది. ఈ మధ్యనే ది ఫ్యామిలీ మెన్ 2తో భారీ ఓటీటీ సక్సెస్ దక్కించుకోగా మరో ఒరిజినల్ ఓటీటీ సినిమాకు సిద్ధమవుతోంది.

Naga Chaitanya: సామ్ బాటలో చైతూ.. ఓటీటీ సినిమాకు ఒకే!

Naga Chaitanya

Naga Chaitanya: అక్కినేని వారి కోడలు సమంతా ఇప్పటికే ఇటు బుల్లితెర మీద హోస్ట్ గానే కాకుండా.. ఓటీటీ సినిమాల మీద కూడా స్పెషల్ దృష్టి పెట్టి దూసుకెళ్తుంది. ఈ మధ్యనే ది ఫ్యామిలీ మెన్ 2తో భారీ ఓటీటీ సక్సెస్ దక్కించుకోగా మరో ఒరిజినల్ ఓటీటీ సినిమాకు సిద్ధమవుతోంది. ఇక, ఇప్పుడు అదే బాటలో భర్త నాగచైతన్య కూడా ఓటీటీ సినిమాకు ఒకే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు తెలుస్తుంది.

ప్రముఖ నిర్మాత శరత్ మరార్ చైతూతో ఓ ఓటీటీ ఫిల్మ్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్ ఓటీటీ చిత్రంగా తెరకెక్కనున్న ఈసినిమా కోసం.. మంచి స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేయగా.. ప్రస్తుతం దర్శకుని వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ వివారాలు ప్రకటించనున్నారు. కాగా, నాగ చైతన్య సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉండగా మరో రెండు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి.

చైతూ ప్రస్తుతం బాలీవుడ్ లో అమిర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దాలో సోల్జర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దానితో పాటుగా థాంక్ యూ సినిమాకి సంబంధించిన షూటింగ్ ను ఇంకా పూర్తి చేయాల్సి ఉండగా.. అనంతరం బంగార్రాజు షూటింగ్ తో పాటు.. ఈ ఓటీటీ ఫిల్మ్ కి సంబంధించిన షూటింగ్ షురూ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.