Thank You Trailer: ధ్యాంక్యూ ట్రైలర్.. ఫిదా అవ్వాల్సిందే!

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘థ్యాంక్యూ’ చిత్ర ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకుల ఎదురుచూపులకు....

Thank You Trailer: ధ్యాంక్యూ ట్రైలర్.. ఫిదా అవ్వాల్సిందే!

Naga Chaitanya Mesmerizes With Thank You Trailer

Thank You: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘థ్యాంక్యూ’ చిత్ర ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకుల ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను కొద్ది క్షణాల ముందే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా లాంఛ్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ ఔట్ అండ్ ఔట్ ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కించాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Thank You: ధ్యాంక్యూ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

ఇక ఈ చిత్ర ట్రైలర్‌లో మనకు నాగచైతన్య పాత్రకు సంబంధించిన సక్సెస్ జర్నీ గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువుండదని నా ఫ్రెండ్ చెప్పాడు..’’ అనే సూపర్బ్ డైలాగ్‌తో ఈ సినిమా కాన్సెప్ట్‌ను మనకు చెప్పకనే చెప్పేశారు. ఇక స్కూల్ డేస్ మొదలుకొని, కాలేజీ లైఫ్, ఆ తరువాత కెరీర్ లైఫ్ ఇలా హీరోకు ఎదురయ్యే పాత్రలు.. వాటిని అతడు అర్ధం చేసుకునే విధానం ఈ సినిమాలో మనకు చూపించబోతున్నారు. ఈ క్రమంలో అతడు ప్రేమ, స్నేహం వంటి అంశాలను ఎలా ఎదుర్కొన్నాడు.. చివరకు అతడి జీవితం సక్సెస్‌ఫుల్‌గా మలిచిన వారికి అతడు ఏ విధంగా ‘ధ్యాంక్యూ’ చెప్పాడనేది ఈ సినిమా కథగా మనకు చూపించబోతున్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Thank You Movie: థాంక్ యూ.. విక్రమ్ కుమార్‌కు, చైతూ బ్రేకిస్తాడా?

మంచి ఫీల్ గుడ్ సినిమాలు వచ్చి చాలా రోజులు అవుతుండటంతో ఈ సినిమా ఆ లోటును ఖచ్చితంగా తీరుస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో అందాల భామలు రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్‌లు నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సోల్‌ఫుల్ మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమాకు బివిఎస్.రవి కథను అందించగా, జూలై 22న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ థ్యాంక్యూ చిత్ర ట్రైలర్‌ను మీరు ఓసారి చూసేయండి.