Naga Chaitanya : తమిళ్ డైరెక్టర్‌తో నాగ చైతన్య ద్విభాషా సినిమా

వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుని అనౌన్స్ చేసాడు చైతూ. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో నాగ చైతన్య సినిమాని అనౌన్స్ చేశారు. నాగ చైతన్య 22వ సినిమాగా........

Naga Chaitanya : తమిళ్ డైరెక్టర్‌తో నాగ చైతన్య ద్విభాషా సినిమా

Chaithu

 

Naga Chaitanya :  సమంతతో విడాకుల తర్వాత చైతూ కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు చైతూ. ఇక వరుసగా సినిమాలని కూడా ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే చైతన్య బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్న ‘లాల్ సింగ్ చద్దా’ రిలీజ్ కి రెడీగా ఉంది. ఆ తర్వాత ‘థ్యాంక్ యూ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఇక చైతూ డిజిటల్ ఎంట్రీ ‘దూత’ వెబ్ సిరీస్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుని అనౌన్స్ చేసాడు చైతూ.

తమిళ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు అనేక డిఫరెంట్ సినిమాలతో మెప్పించాడు. ఇటీవలే శింబుతో మానాడు సినిమా తీసి భారీ విజయం సాధించారు. ఈ సినిమా ప్రేక్షకులకి బాగా నచ్చింది. అంతే కాక ప్రేక్షకులు, సెలబ్రిటీలు దీనిపై ప్రశంసల వర్షం కురిపించారు.

RC15 : శంకర్ సినిమా నుంచి చరణ్ లుక్ లీక్.. పంచెకట్టుతో సైకిల్ పై..

ఇప్పుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో నాగ చైతన్య సినిమాని అనౌన్స్ చేశారు. నాగ చైతన్య 22వ సినిమాగా ఇది తెరకెక్కనుంది. తెలుగు, తమిళ్ భాషల్లో ద్విభాషా సినిమాగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నారు. ఈ సినిమాని ఇవాళ అధికారికంగా ప్రకటించగా మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.