Naga Chaitanya : కస్టడీ నుండి నేరుగా రైటర్ వద్దకు వెళ్తున్న చైతూ.. నిజమేనా?

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో చైతూ ఓ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమా తరువాత ‘రైటర్ పద్మభూషణ్’ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Naga Chaitanya : కస్టడీ నుండి నేరుగా రైటర్ వద్దకు వెళ్తున్న చైతూ.. నిజమేనా?

Naga Chaitanya Next Movie With Writer Padmabhushan Director

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో చైతూ ఓ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకునేందుకు చైతూ రెడీ అవుతున్నాడు.

Naga Chaitanya: ఇళయరాజాతో నాగచైతన్య ఫోటో.. వెరీ స్పెషల్ అంటోన్న హీరో!

కాగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుక చైతూ అప్పుడే కథలు వింటున్నాడట. ఈ క్రమంలోనే ఇటీవల ఓ సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వంలో చైతూ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల సుహాస్ హీరోగా వచ్చిన ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను మంచి ఫీల్ గుడ్ కథతో తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాడు ఈ డైరెక్టర్.

Naga Chaitanya : నాగచైతన్య పై క్రష్ ఉందంటున్న మజిలీ బ్యూటీ.. పెళ్లి వార్తలు పై క్లారిటీ!

ఇప్పుడు ఈ డైరెక్టర్ చెప్పిన ఓ కథకు చైతూ ఇంప్రెస్ అయ్యాడట. అయితే ఈ విషయంపై అటు హీరో కానీ, డైరెక్టర్ కానీ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ కాంబినేషన్‌ గురించి ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక కస్టడీ సినిమాలో చైతూ సరసన అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా, ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.