Naga Chaitanya-Samantha: సోషల్ మీడియా సాక్షిగా చై.. సామ్.. సిద్దార్థ్.. జుకల్కర్‌!

తెలుగు సినిమా పరిశ్రమలో యంగ్ స్టార్ కపుల్స్ లో క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా.. నాగ చైతన్యల పదేళ్ల బంధం ముగిసింది. తామిద్దరం విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా చైతన్య..

Naga Chaitanya-Samantha: సోషల్ మీడియా సాక్షిగా చై.. సామ్.. సిద్దార్థ్.. జుకల్కర్‌!

Naga Chaitanya Samantha

Naga Chaitanya-Samantha: తెలుగు సినిమా పరిశ్రమలో యంగ్ స్టార్ కపుల్స్ లో క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా.. నాగ చైతన్యల పదేళ్ల బంధం ముగిసింది. తామిద్దరం విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా చైతన్య ప్రకటించగా గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఇదే కథలు కథలుగా మారింది. ఎవరికి వారు దీనికి కారణమేంటని.. దీని వెనుకున్న రహస్యమేంటని ఛేదించే ప్రయత్నాలు కూడా చేసి అలసిపోయారు. దీనికి తోడు సోషల్ మీడియా సాక్షిగా చై, సామ్ తో పాటు మరికొందరు చేసే ట్వీట్స్ కూడా మరింత చర్చగా మారుతుంది.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

మరీ ముఖ్యంగా విడాకుల ప్రకటనకు ముందు.. ప్రకటన తర్వాత సమంతా చేసిన ట్వీట్స్ తో పాటు ఆమె స్టైలిష్ట్‌ జుకల్కర్‌, నటుడు సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారాయి. సమంతా, చైతన్య విడాకుల ప్రకటన చేసిన వెంటనే నటుడు సిద్ధార్థ్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. అందులో, “మోసగాళ్ళు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు. ఇదే నేను నా స్కూల్ లో నేర్చుకున్న పాఠం. మీరు మీ స్కూల్లో ఏం నేర్చుకున్నారు?” అని ట్వీట్ చేశారు. సామ్-చై విడాకుల నేపథ్యంలోనే సిద్దార్థ్ ఈ ట్వీట్ చేశాడని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Samantha-Nagachaitanya: మరోసారి పేరు మార్చుకున్న సామ్!

ఇక కొన్నేళ్లుగా సమంతకు వ్యక్తిగత స్టైలిష్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రీతమ్‌ జుకల్కర్ చేసే పోస్టులైతే మరింత రచ్చగా మారుతున్నాయి. ‘నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే అబద్ధాలు, రహస్యాలనేవి అనుబంధాలను తుంచివేస్తాయి’ అంటూ పోస్ట్‌ చేసిన జుకల్కర్‌.. కొన్ని నిమిషాల్లోనే దానిని డిలీట్‌ చేసేశాడు. ‘ప్రజలు నన్ను ఇష్టపడుతున్నారా? లేదా? అనే విషయాన్ని పట్టించుకోను. ఎందుకంటే నేను ఈ భూమ్మీదకు వచ్చింది వాళ్ల మన్ననలు పొందడానికి కాదు. మంచి మనిషిగా ఉండటానికి. అలాగే ఉంటాను’ అని మరో పోస్ట్ చేశాడు.

God Father: చెల్లిగా కీర్తి.. తల్లిగా గంగవ్వ ఫిక్స్!

ఇవి మాత్రమే కాదు.. విడాకుల ప్రకటనకు ముందు కూడా ఇలాంటి పోస్టులే చేసి మళ్ళీ డిలీట్ చేశాడు. విడాకుల ప్రకటన రోజు కూడా ప్రీతమ్ కంగ్రాట్స్ చెప్తూ పోస్ట్ చేయడం.. బూతు పదాలను వాడుతూ ఇకపై అతను నీ వాడే అంటూ ఓ పోస్ట్ చేసి మళ్ళీ దాన్ని డిలీట్ చేశాడు. ఇక సమంతా కూడా చాలా రోజులుగా అస్పష్టంగా బాధను వ్యక్తం చేస్తూ పోస్టులు చేస్తుండగా.. తాము విడిపోతున్నట్లు ప్రకటించడానికి కొన్ని గంటల ముందు పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చకు దారి తీసింది.

Bigg Boss 5: నటరాజ్ అవుట్.. రొమాన్స్‌లో మునిగి తేలిన పింకీ, విశ్వ

‘నేను నిరాశకు గురైనప్పుడు.. చరిత్రలో ఎప్పుడూ నిజం, ప్రేమే విజయం సాధించాయని గుర్తు చేసుకున్నాను. నియంతలు ఎంతమందైనా ఉండొచ్చు.. కొంతకాలం వాళ్లు అజేయంగా కనిపించవచ్చు. కానీ ఏదో ఒకరోజు వాళ్లు కిందపడిపోక తప్పదు. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను’ అంటూ సమంత వాళ్ళ అమ్మ చెప్పిన మాటగా ఒక పోస్ట్‌ పెట్టింది. ఇలా వీళ్ళే ఇలా రకరకాలుగా పోస్టులు పెడుతుంటే సోషల్ మీడియాలో ఎవరికి వారు ఇష్టారీతిన చర్చలు చేస్తున్నారు.