Naga Chaitanya: ‘లాల్ సింగ్ చడ్డా’ కోసం చైతూ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్ర ‘లాల్ సింగ్ చడ్డా’ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు అమీర్ ఖాన్ అండ్ టీమ్ భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా చేసింది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించడంతో ఆయన పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. పర్ఫార్మెన్స్ పరంగా చైతూ బెస్ట్ ఇచ్చాడని పలువురు సినీ విశ్లేషకులు సైతం అంటున్నారు.

Naga Chaitanya: ‘లాల్ సింగ్ చడ్డా’ కోసం చైతూ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Naga Chaitanya: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్ర ‘లాల్ సింగ్ చడ్డా’ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు అమీర్ ఖాన్ అండ్ టీమ్ భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా చేసింది. అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్యలు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ చేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

Laal Singh Chaddha: అడ్వాన్స్ బుకింగ్స్‌లో వెనుకబడ్డ బడా సినిమాలు!

అయితే ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. కానీ, ఈ సినిమాకు తొలిరోజే నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమా మున్ముందు ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించడంతో ఆయన పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. పర్ఫార్మెన్స్ పరంగా చైతూ బెస్ట్ ఇచ్చాడని పలువురు సినీ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఇంతకీ చైతూ ఈ బాలీవుడ్ సినిమాలో నటించినందుకు ఎంత రెమ్యూనరేషన్ పుచ్చుకున్నాడో తెలుసా? టాలీవుడ్‌లో చైతూ ఒక్కో సినిమాకు సుమారు రూ.8 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నాడు.

Laal Singh Chaddha: ‘లాల్ సింగ్ చడ్డా’కు తెలుగు ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు – చిరంజీవి

కాగా, బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చడ్డాలో చైతూది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. అందుకే ఈ సినిమాలో నటించినందుకు చైతూ ఏకంగా రూ.5 కోట్ల మేర రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ విభిన్నమైన పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసింది. కానీ, రిలీజ్ తరువాత ఈ సినిమాపై సర్వత్రా నెగెటిప్ రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ సినిమా అమీర్ ఖాన్ కెరీర్‌లో ఎలాంటి మూవీగా మిగులుతుందో తెలియాలంటే ఈ సినిమా టోటల్ రన్ పూర్తయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.