Samantha: సామ్ అనారోగ్యం.. చైతూ మౌనం.. అభిమానులు అయోమయం!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసినప్పటి నుంచి ఆమె అభిమానులతో పాటు సెలెబ్రిటీలు ఆమెకు ధైర్యం చెబుతూ, త్వరగా కోలుకోవాలని వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీతో విడిపోయిన సమంతకు నాగచైతన్య కూడా ట్వీట్ చేస్తాడని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నా, ఈ హీరో మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉన్నాడు.

Samantha: సామ్ అనారోగ్యం.. చైతూ మౌనం.. అభిమానులు అయోమయం!

Naga Chaitanya Silent On Samantha Health Confuses Fans

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసినప్పటి నుంచి ఆమె అభిమానులతో పాటు సెలెబ్రిటీలు ఆమెకు ధైర్యం చెబుతూ, త్వరగా కోలుకోవాలని వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అందరూ సామ్‌ను త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు.

Samantha: సమంత ఆరోగ్యంపై స్పందించిన అక్కినేని హీరో.. వైరల్ అవుతున్నా కామెంట్స్!

ఇక టాలీవుడ్‌లో చాలా మంది స్టార్స్ సమంత ఆరోగ్యంపై వరుసగా ట్వీట్లు చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని కోరారు. అయితే అక్కినేని ఫ్యామిలీతో విడిపోయిన సమంతకు ఆ ఫ్యామిలీ నుండి ఎవరూ ట్వీట్ చేయరని అందరూ అనుకున్నారు. కానీ.. తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా, వాటిని పక్కనబెట్టి అక్కినేని అఖిల్ సామ్ ఆరోగ్యంగా ఉండాలని, ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు. దీంతో ఇక నాగచైతన్య కూడా సామ్ అనారోగ్యంపై ట్వీట్ చేస్తాడని అందరూ అనుకున్నారు.

Samantha: సమంత త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీల ట్వీట్ల వర్షం!

కానీ, చైతూ మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు. దీంతో ఈ అక్కినేని హీరో సామ్ ఆరోగ్యం గురించి తెలుసుకుని ఆమెను ఓదారుస్తాడా లేడా అనే అయోమయంలో అభిమానులు పడ్డారు. మరి నిజంగానే సామ్ ఆరోగ్యంపై చైతూ ట్వీట్ చేస్తాడో లేదో చూడాలి.