చైతు కోసం మోకాళ్లపై 1000 మెట్లు ఎక్కిన అభిమాని : స్పందించిన చై, సామ్

నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా సింహాచలం ఆలయంలోని వెయ్యి మెట్లు మోకాలితో ఎక్కాడు బొబ్బిలికి చెందిన అక్కినేని వీరాభిమాని సాగర్‌.. తమను కలవాలంటూ రిప్లై ఇచ్చిన సమంత..

  • Published By: sekhar ,Published On : November 26, 2019 / 08:00 AM IST
చైతు కోసం మోకాళ్లపై 1000 మెట్లు ఎక్కిన అభిమాని : స్పందించిన చై, సామ్

నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా సింహాచలం ఆలయంలోని వెయ్యి మెట్లు మోకాలితో ఎక్కాడు బొబ్బిలికి చెందిన అక్కినేని వీరాభిమాని సాగర్‌.. తమను కలవాలంటూ రిప్లై ఇచ్చిన సమంత..

సినీ హీరోలు తరచూ అభిమానులను ఉద్దేశించి చెప్పే మాట.. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం అని.. నిజమే మరి.. మాటల్లో చెప్పలేనిది, వెలకట్టలేనిది అభిమానం.. కొన్నిసార్లు అభిమానం అనేది హద్దులు దాటినా, ఒక్కోసారి ఫ్యాన్స్ చేసే మంచి పనులు హీరోలకు మాటలు రాకుండా చేస్తాయి కూడా. నవంబర్ 23న యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా సాగర్ అనే వీరాభిమాని సింహాచలం ఆలయంలోని 1000 మెట్లు మోకాళ్లపై ఎక్కాడు.

Embedded video

‘నాగచైతన్య, సమంత మేడమ్ నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలి, వాళ్లకి వారసుడు పుట్టాలి, హ్యాపీ బర్త్‌డే చైతూ బంగారం’ అంటూ బొబ్బిలికి చెందిన సాగర్ వీడియోకు నాగార్జున, నాగచైతన్య, సమంతలను ట్యాగ్ చేస్తూ నవీన్ ప్రసాద్ అనే మరో అభిమాని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో చూసి చై, సామ్ స్పందించారు. ‘ఏం చెప్పాలో తెలియడం లేదు, మాటలు రావడం లేదు, మీ ప్రేమకు థ్యాంక్స్, ఇంకా బాగా నటించడానికి మీరందరూ నన్నుఇన్‌స్పైర్ చేస్తుంటారు.. టేక్ కేర్’ అంటూ చై రిప్లై ఇవ్వగా.. సామ్ ‘థ్యాంక్యూ.. ఇది నమ్మశక్యం కాని నిజం.. మాటలు రావడం లేదు. దయచేసి మీరు మమ్మల్ని కలవండి’ అని ట్వీట్‌ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.