Custody : ఆఖరి షెడ్యూల్‌లో నాగచైతన్య కస్టడీ..

యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'కస్టడీ'. తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పోలీస్ కథాంశంతో ప్రేక్షకుల ముందు రాబోతుంది. గత ఏడాది సెప్టెంబర్ లో మొదలైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

Custody : ఆఖరి షెడ్యూల్‌లో నాగచైతన్య కస్టడీ..

Naga Chaitanya's custody in the final schedule

Custody : యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పోలీస్ కథాంశంతో ప్రేక్షకుల ముందు రాబోతుంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ దర్శకుడు ఇటీవల టైమ్ లూప్ మూవీ ‘మానాడు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఈ సినిమాపై రెండు భాషల్లో మంచి హైప్ నెలకుంది.

Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో చైతూ మూవీ.. లేనట్టేనా..?

గత ఏడాది సెప్టెంబర్ లో మొదలైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ శుక్రవారం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ మొదలయింది. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నాడు దర్శకుడు వెంకట్ ప్రభు. ఈ నెలతో షూటింగ్ కంప్లీట్ చేసుకోనుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకోడానికి దాదాపు మూడు నెలలు పాటు సమయం తీసుకుంటున్నారు మేకర్స్.

బంగార్రాజు సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న నాగచైతన్య, క్రిటిశెట్టి ఈ చిత్రంలో మరోసారి కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు పని చేస్తుండడం విశేషం. మాస్ట్రో ఇళయరాజా అండ్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు.

ఇక న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్ లో నాగచైతన్య మాస్ లుక్ లో అదరగొట్టాడు. చైతన్య ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ అక్కినేని యువహీరో ఎప్పటి నుంచో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా సక్సెస్ మాత్రం అందడం లేదు. మరి ఈ తమిళ దర్శకుడైన ఆ ముచ్చటిని తీరుస్తాడా అనేది చూడాలి.