Chay Sam : సమంత డైరెక్టర్ తో నాగచైతన్య సినిమా.. వద్దంటున్న అభిమానులు..

ఈ సినిమాపై నాగచైతన్య అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత రెండు సినిమాలు చేసింది. సమంత చేసిన టాక్ షో 'సామ్ జామ్'కి కూడా నందిని రెడ్డినే

Chay Sam : సమంత డైరెక్టర్ తో నాగచైతన్య సినిమా.. వద్దంటున్న అభిమానులు..

Naga Chaitanya

chay sam :  ఇటీవల చై సామ్ విడిపోయిన విషయం కొన్ని రోజులు ట్రెండ్ లో నిలిచింది. వాళ్ళు మాత్రం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సమంతని ట్రోల్ చేయడం జరిగింది. తను ఆ ట్రోల్ల్స్ కి ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా ఈ టాపిక్ గురించి అభిమానులు ఏదో ఒక రకంగా మాట్లాడుతూనే ఉన్నారు. సమంత, నాగ చైతన్య తమ తర్వాతి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక్కడే కొత్త ప్రాబ్లమ్ వచ్చింది.

ఇటీవల నాగచైతన్య లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. నాగ‌చైత‌న్య‌, నందినీ రెడ్డి కాంబినేష‌న్‌లో ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రాబోతుంది. ఇప్పుడు ఈ సినిమాపై నాగచైతన్య అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత రెండు సినిమాలు చేసింది. సమంత చేసిన టాక్ షో ‘సామ్ జామ్’కి కూడా నందిని రెడ్డినే డైరెక్టర్. వీళ్లిద్దరు పర్సనల్ గా కూడా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ అయింది.

Cinema : ఈ సినిమాలు ఎప్పుడొస్తాయి??

సమంత నుంచి విడిపోయిన నాగ చైతన్య సమంత ఫ్రెండ్ అయిన డైరెక్టర్ నందిని రెడ్డితో సినిమా చేయొద్దు అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చైత‌న్య‌కేమైనా పిచ్చి ప‌ట్టిందా? అస‌లు ఆ సినిమాను ఆయ‌న ఎందుకు ఓకే చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. సమంత డైరెక్టర్ మూవీలో మా హీరో సినిమా చేయడం ఏంటి అని అభిమానులు అనుకుంటూ ఇలా వద్దని కామెంట్లు పెడుతున్నారు. కానీ సినిమా వాళ్ళకి ఇదేమి ఉండదు. వాళ్ళు సినిమాని పర్సనల్ లైఫ్ ని వేరు వేరుగా చూస్తారు. అభిమానులు కామెంట్లు చేసినా ఈ సినిమా అయితే ఆగదు అనే తెలుస్తుంది. అభిమానులే సినిమా వేరు, పర్సనల్ లైఫ్ వేరు అని అర్ధం చేసుకోవాలని కొంతమంది ఆ కామెంట్లకి రిప్లైలు ఇస్తున్నారు.
దీనికే ఇంత రియాక్ట్ అవుతున్నారంటే ఇప్పటికే నాలుగు సినిమాలు కలిసి చేసిన చైతన్య సమంత భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ కలిసి నటించాల్సి వస్తే అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.