ఈ ఏడాది 4 సినిమాలు రిలీజ్ చేయాలనేది చైతూ ప్లాన్.

  • Published By: veegamteam ,Published On : April 1, 2019 / 07:15 AM IST
ఈ ఏడాది 4 సినిమాలు రిలీజ్ చేయాలనేది చైతూ ప్లాన్.

ప్లాపుల మీద ప్లాపులు పడుతున్నా..అక్కినేని హీరో నాగచైతన్య స్పీడ్ తగ్గడం లేదు. వరుసబెట్టి లవ్ స్టోరీలు.. కామెడీ సినిమాలు చేస్తూ ఖచ్చితంగా హిట్టు కొట్టేందుకు ప్లాన్ వేస్తున్నాడు. ఆరునూరైనా ఈసారి టార్గెట్ మిస్సవ్వకూడదని గట్టిగా ఫిక్సయ్యాడు చైతూ. 2017లో వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత  చైతూ వరుస ప్లాపులతో డీలాపడిపోయాడు. హిట్టుకొట్టేందుకు ఎన్ని ప్రయోగాలు చేసినా చైతూకి అదృష్టం అస్సలు కలిసిరాలేదు. బ్యాక్ టూ బ్యాక్ యుద్ధం శరణం, శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి ఇలా హ్యాట్రిక్ ప్లాపుల్ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. వరుసగా ప్లాపులున్నా ఈ అక్కినేని హీరో స్పీడ్ మాత్రం తగ్గించడం లేదు. వరుస సినిమాలతో చైతూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.
Read Also : జనసేన పంచె రాజకీయం : అప్పుడు పంచెలూడదీస్తా.. ఇప్పుడు పంచెకట్టే గౌరవం

శివ నిర్వాణ డైరెక్షన్ లో నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ సినిమా ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే రిలీజైన మజిలీ టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దీనికి తోడు పెళ్లి తర్వాత స్యామ్, చైతూ ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తుండటంతో మజిలీ సినిమా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మజిలీ సినిమాతో పాటుగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్.. ఈ నెల 22 నుంచి వెంకీ మామ సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. సమ్మర్ తర్వాత ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుంది. మరోవైపు రెండు సినిమాలు ఇంకా సెట్స్ మీద ఉండగానే తర్వాతి ప్రాజెక్టులపై చైతన్య ఫోకస్ పెట్టాడు. దిల్ రాజు బ్యానర్ లో ఓ కొత్త డైరెక్టర్ తో సినిమా చేసేందుకు కమిటయ్యాడు. అంతేకాదు.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో యాక్షన్ మూవీ చేయనున్నాడు. సో అన్నీ కుదిరితే ఒకే ఏడాది నాలుగు సినిమాలతో సందడి చేసేందుకు నాగచైతన్య గట్టి ప్లానే వేశాడు.
Read Also : సినిమా సెట్ కాదండీ : కొడ‌వ‌లి చేత‌బ‌ట్టిన హేమామాలినీ