Naga Shaurya: హిట్టు కోసం పాకులాట.. వర్షంలో సైతం నాగశౌర్య పాదయాత్ర!

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం “కృష్ణ వ్రింద విహారి”. లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. బుధవారం తిరుపతిలో మొదలైన “కృష్ణ వ్రింద విహారి టీం పాద యాత్ర”, ఆదివారం వరకు పలు ప్రధాన పట్టణాల్లో కొనసాగనుంది. నేడు(శుక్రవారం) విజయవాడ-గుంటూరు-ఏలూరు లో ఈ పాదయాత్ర జరగనుంది. ఈ క్రమంలో మొన్న తిరపతిలో...

Naga Shaurya: హిట్టు కోసం పాకులాట.. వర్షంలో సైతం నాగశౌర్య పాదయాత్ర!

Naga Shaurya Continues his Padayatra in Rain

Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం “కృష్ణ వ్రింద విహారి”. లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ‘ఛలో’ సినిమా తరువాత సరైన హిట్ లేని నాగశౌర్య ఈ సినిమాతో ఎలా అయినా హిట్టు కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ క్రమంలోనే “కృష్ణ వ్రింద విహారి టీం పాద యాత్ర” అంటూ సరికొత్త ప్రమోషన్స్ కి కాలు కదిపాడు.

Naga Shaurya: “కృష్ణ వ్రింద విహారి” సరికొత్త ప్రమోషన్స్.. నాగశౌర్య పాద యాత్ర!

బుధవారం తిరుపతిలో మొదలైన ఈ పాదయాత్ర, ఆదివారం వరకు పలు ప్రధాన పట్టణాల్లో కొనసాగనుంది. నేడు(శుక్రవారం) విజయవాడ-గుంటూరు-ఏలూరు లో ఈ పాదయాత్ర జరగనుంది. ఈ క్రమంలో మొన్న తిరపతిలో వర్షం పడుతున్న నాగశౌర్య లెక్కచేయకుండా పాదయాత్రను కొనసాగిస్తూ, అడిగిన ప్రతి అభిమానికి సెల్ఫీలు ఇచ్చుకుంటూ ముందుకు సాగాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసిన నెటిజెన్లు.. ఈ సినిమాతో హీరో నాగశౌర్య ఎలా అయినా హిట్ కొట్టాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అనీష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో నాగశౌర్యకి జంటగా ‘షిర్లీ సేఠియా’ నటించింది. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.