Naga Shaurya: పెళ్లికి ముహూర్తం పెట్టుకున్న నాగశౌర్య..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవలే తన అన్న పెళ్లి చేసిన ఈ చార్మింగ్ హీరో.. ఈ నెలాఖరుకి తాను ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. నాగ శౌర్య తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. నాగశౌర్యని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో నిలబెట్టింది. ఇక విషయానికి వస్తే, ఈ రొమాంటిక్ హీరో బెంగళూరుకు చెందిన..

Naga Shaurya: పెళ్లికి ముహూర్తం పెట్టుకున్న నాగశౌర్య..

Naga Shaurya is getting married

Naga Shaurya: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవలే తన అన్న పెళ్లి చేసిన ఈ చార్మింగ్ హీరో.. ఈ నెలాఖరుకి తాను ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. నాగ శౌర్య తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. నాగశౌర్యని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో నిలబెట్టింది.

Naga Shaurya: నాగశౌర్య సినిమాకు సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఎవరంటే?

ఇక విషయానికి వస్తే.. ఈ రొమాంటిక్ హీరో బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషా శెట్టిని వివాహం చేసుకోబోతున్నాడట. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెళ్లి శుభలేఖని మీడియాకి విడుదల చేశారు కుటుంబ సభ్యులు. బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరగనుంది. నవంబర్ 20, 2022న ఉదయం 11:25 గంటలకు నాగశౌర్య, అనూషకి మూడు ముళ్ళు వేయనున్నాడు.

దీంతో అభిమానులు, సెలెబ్రెటీస్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా నాగశౌర్య ఇటీవలే తన 24వ సినిమాను మొదలుపెట్టాడు. వైష్ణవి ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు అరుణాచలం తెరకెక్కిస్తున్న ఈ సినిమా యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హేరిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు.

Naga Shaurya's Wedding With Anusha On Nov 20