నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం

నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై, ఉషా మల్పూరి నిర్మిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

  • Published By: sekhar ,Published On : May 11, 2019 / 10:11 AM IST
నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం

నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై, ఉషా మల్పూరి నిర్మిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై, ఉషా ముల్పూరి నిర్మిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, శరత్ మరార్, పరుశురామ్, నందినీ రెడ్డి, బివిఎస్ రవి తదితరులు విచ్చేసి యూనిట్‌ని విష్ చేసారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన మహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు క్లాప్ నిచ్చారు. నాగశౌర్య కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.

నాగశౌర్య హోమ్ ప్రొడక్షన్, ఐరా క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం-3గా రూపొందనున్న ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతమందిస్తుండగా, గ్యారీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది.