Bhola Shankar : కీర్తి సురేష్ భర్తగా!
మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీలో యంగ్ హీరో నాగ శౌర్య ఓ ఇంపార్టెంట్ రోల్ చెయ్యబోతున్నాడని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి..

Bhola Shankar
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యమా స్పీడ్ మీదున్నారు. ‘ఆచార్య’ కి గుమ్మడికాయ కొట్టేసాక.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాను స్టార్ట్ చేశారు. చిరంజీవి నటిస్తున్న 155 సినిమాగా.. తమిళ్ సూపర్ హిట్ ‘వేదాళం’ తెలుగు రీమేక్‌గా రూపొందుతోంది.
Radhe Shyam : ‘రాధే శ్యామ్’ నేషనల్ ఈవెంట్ హైలైట్స్
మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా, చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.. AK ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఆధారంగా రూపొందుతున్న ‘భోళా శంకర్’ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది.
Manoj Manchu: మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్
ఈ సినిమా గురించి ఫిలింనగర్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. యంగ్ హీరో నాగ శౌర్య నటించబోతున్నాడట. అది కూడా చిరంజీవి చెల్లెలిగా చేస్తున్న కీర్తి సురేష్ భర్త క్యారెక్టర్‌లో అని వార్తలు వినిపిస్తున్నాయి. మూవీ టీం త్వరలో ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారని సమాచారం.
Pushpa Movie : ‘పుష్ప’ ముందు హిందీ సినిమాలు తేలిపోయాయి-కరణ్ జోహర్..