Naga Shaurya: ఒక్క హిట్ కోసం నాగశౌర్య ఎన్నో ఆశలు.. ఈసారైనా?

టాలీవుడ్ లో యంగ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. ఎప్పటికప్పుడు వెరైటీ సబ్జెక్ట్స్, డిఫెరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు.. అయినా నాగశౌర్య అంచనాలు తలకిందులవుతున్నాయి.

Naga Shaurya: ఒక్క హిట్ కోసం నాగశౌర్య ఎన్నో ఆశలు.. ఈసారైనా?

Naga Shaurya

Naga Shaurya: టాలీవుడ్ లో యంగ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. ఎప్పటికప్పుడు వెరైటీ సబ్జెక్ట్స్, డిఫెరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు.. అయినా నాగశౌర్య అంచనాలు తలకిందులవుతున్నాయి. వరుసగా ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు పెద్ద సక్సెస్ నాగశౌర్యను ఊరిస్తోంది. ఆ వివరాలిప్పుడు చూద్దాం.

Naga Shaurya : వెంకటేష్ కంటే బాగా చూసుకుంటా.. ‘కృష్ణ వ్రింద విహారి’ టీజర్ రిలీజ్..

వరుసగా ఫెయిల్యూర్స్ పలకరించినా నాగశౌర్య సినిమాలు మాత్రం ఆడడం లేదు. ఇయర్ కి ఒకటి రెండు సినిమాలు కంపల్సరీ రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ 10 2021న అర్చరీ బ్యాక్ డ్రాప్ లో ఆడియన్స్ కు లక్ష్య అందించాడు. ఆ వెంటనే జనవరి 7, 2022న రీతూవర్మతో జతకట్టి వరుడు కావలెను సినిమాను స్ర్టీమింగ్ కి వదిలాడు. లేటెస్ట్ గా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ డైరెక్షన్ లో నాగశౌర్య చేసిన సినిమా కృష్ణ వ్రింద విహారి. ఈనెల 20న థియేటర్లోకి రానుంది.

Naga Shaurya: ఒక్క హిట్ ప్లీజ్.. బ్రేక్ కోసం నాగశౌర్య ఫీట్స్

కృష్ణ వ్రింద విహారి.. అరే టైటిలే కొత్తగా ఉందంటే, ఈ సినిమాలో నాగశౌర్య లుక్ ప్లజెంట్ గా ఉంది. నాగశౌర్యకు జోడీగా షిర్లే షెటియా నటిస్తోంది. ఇద్దరి జోడీ బాగా కుదిరింది. ఫామిలీ ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకునేలా రెడీ అయిన ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు హాండ్సమ్ హీరో్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Naga Shaurya: అమ్మాయిలు చాలా టఫ్.. డీల్ చేయడం కష్టమే!

ఇప్పుడు కృష్ణ వ్రింద విహారితో కలిపి నాగశౌర్య రెండు సినిమాలు చేస్తున్నాడు. నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న పలానా అబ్బాయి, పలానా అమ్మాయి సినిమా మేకింగ్ దశలో ఉంది. ఊహలు గుస గుసలాడే సినిమా తర్వాత వీళ్లద్దరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు నాగశౌర్య.